అదే నిజమా!: బాబుపై లోకేష్ వ్యాఖ్య, జూ.ఎన్టీఆర్‌పై వ్యూహమేనా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గురువారం నాడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు మూడేళ్ల క్రితమే పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని అనుమతి కోరానని అయితే, కార్యకర్తల సంక్షేమానికి కృషి చేశాకనే రావాలని ఆయన చెప్పారని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయన కర్నూలులో ఈ విషయం చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. నాడు లోకేష్ రాజకీయ ఆరంగేట్రం పైన చర్చ సాగుతోందని వార్తలు వచ్చాయి. అయితే, వీటిని కొందరు నేతలు కొట్టి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాడు కొన్ని సందర్భాలలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు వారసుడి అంశంపై చర్చ అనవసరమని చెప్పారు.
కానీ, ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపై మరో చర్చ సాగుతోంది. చంద్రబాబు వ్యూహాత్మకంగానే లోకేష్‌ను.. తర్వాత రాజకీయాల్లోకి రావాలని సూచించారా? అనే వాదన వినిపిస్తోంది. గతంలో వారసత్వం విషయంలో నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి.

హీరో జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్‌ల మధ్య వారసత్వ పోరు జరిగిందనే వార్తలు వచ్చాయి. చంద్రబాబు లోకేష్ కోసం, హరికృష్ణ ఎన్టీఆర్ కోసం చూసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో లోకేష్ రాజకీయాల్లోకి వస్తే ఇబ్బందులు తలెత్తేవని భావించే వారు ఉన్నారు.
అందుకే, చంద్రబాబు వ్యూహాత్మకంగా లోకేష్ రాజకీయ ఆరంగేట్రాన్ని పక్కన పెట్టినట్లుగా అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలతో అది నిజమని తేలిందని కొందరు భావిస్తున్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే లోకేష్ ఆరంగేట్రాన్ని పోస్ట్ పోన్ చేసి.. ఇప్పుడు క్రమంగా పార్టీలో వారసుడిగా తీసుకు వస్తున్నారని, అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టారని అర్థమవుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications