మోడీ స్కీం: ప్రతిజ్ఞ చేయించిన బాబు, మనుషులేకాదని
విజయవాడ: నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో దేశమంతా పాల్గొంటోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. చంద్రబాబు స్వచ్ఛ భారత్ కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. వారంలో రెండు గంటల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోడీ అన్ని దేశాలు తిరిగి దేశ ప్రతిష్టను పెంచారన్నారు. ఎవరికీ దక్కని గౌరవం మోడీకి దక్కిందన్నారు.
నాడు స్వాతంత్రం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. జై జవాన్.. జై కిసాన్ అని పిలుపునిచ్చింది శాస్త్రియే అన్నారు. అవినీతి కాంగ్రెస్ వల్ల మనం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నామన్నారు. మహాత్మా గాంధీ ఎప్పుడు ప్రజల కోసం బతికారన్నారు. క్రమశిక్షణతో, సాదారణ పౌరుడిలా గడిపారన్నారు. ఆయన ఎప్పుడు సత్యమే చెప్పేవారన్నారు.

గాంధీ కల కన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మనమంతా పాల్గొనాలన్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా అన్నారు. నాడు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విడగొట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మన మనోభావాలను దెబ్బతీసిందన్నారు.
ఆ కోపం, ఆవేదన, ఆగ్రహాన్ని నిన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పైన చూపించారన్నారు. అయితే, నాడే మోడీ, తాను పలు హామీలు ఇచ్చామని, మీకు అండగా ఉంటామని చెప్పామన్నారు. రాబోయే రోజుల్లో అందరు మరుగుదొడ్లు వినియోగించాలన్నారు. పెంట ఎక్కడ పడితే అక్కడ వేస్తే వాళ్లు మనుషులే కాదన్నారు. పరిశుభ్రత విషయంలో అందరిలోను చైతన్యం రావాలన్నారు.












Click it and Unblock the Notifications