ఆ కంపెనీలు ఏపీకి వస్తే బాగుంటుంది: జపనీయులపై బాబు ప్రశంసలు

హైదరాబాద్: జపాన్ భవిష్యత్తును మార్చిన కంపెనీలు కొన్ని ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. జపాన్ పర్యటన విశేషాలను చంద్రబాబు సచివాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జపాన్ భవిష్యత్తును మార్చిన కంపెనీలను మన రాష్ట్రానికి వస్తే బాగుంటుందన్నారు. మనపై నమ్మకం కలిగితే జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై జపాన్‌కు వెళ్లామన్నారు. జపాన్ - భారత్ కో ఆపరేషన్ కమిటీతో చర్చించామన్నారు. చాలా ప్రయివేటు కంపెనీల ప్రతినిధులను కలిసి చర్చించామన్నారు. జపాన్‌లో ఆర్థికంగా పుంజుకున్న ప్రాంతాలన్నింటా పర్యటించామన్నారు. నకటా వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను సందర్శించి, అక్కడి పనులను పర్యవేక్షించామన్నారు. జెట్రో, జపనీస్ ట్రేడ్ ఆర్గనైజేషన్, జపనీస్ బ్యాంక్ ఆఫ్ కో ఆపరేషన్ వాటిని సందర్శించామన్నారు.

జపాన్ దేశస్తులు అంత సులభంగా ఎవరినీ నమ్మరని, ఉత్తినే పెట్టుబడులు పెట్టరన్నారు. భారత దేశం పైన వారికి నమ్మకం కుదురుతోందన్నారు. తాము జపాన్‌కు వెళ్లి అవగాహన కల్పించామని చెప్పారు. సునామీ, తుఫాన్లు, రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్నప్పటికీ.. జపాన్ ఇప్పుడు ఊహించని విధంగా అభివృద్ధి సాధించిందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో అనుకోని విధంగా ముందుకు వెళ్లారన్నారు.

Chandrababu praises Japan's development

జెట్రో, జైకా తదితర కంపెనీలతో మాట్లాడామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. జైకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్నారు. జేబీఐసీ ఇండస్ట్రీస్‌కు అది ఫైనాన్స్ చేసే కార్పోరేషన్ అని తెలిపారు. రాబోయే రెండుమూడు రోజుల్లో వాతావరణం, వర్షాలు తదితర అంశాల పైన నివేదిక తయారు చేస్తామని చెప్పారు. సుమిటియో కంపెనీలతో నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు.

మెథీ అనే ప్రభుత్వ ఆర్గనైజేషన్‌తో ఒప్పందం చేసుకున్నానని చెప్పారు. జపాన్‌లో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, జీడీపీలో భారత్ కంటే రెండింతలు ముందుందన్నారు. జపాన్‌లో ప్రముఖ ప్రతినిధుల కంపెనీలను కలిశామన్నారు. కొన్ని కంపెనీలతో ఎంవోయు కుదుర్చుకున్నామని చెప్పారు. జపాన్ వారికి భారత్ అంటే కొంత వరకు అవగాహన ఉందని, మొత్తం లేదన్నారు. నిరంతర శ్రమ, క్రమశిక్షనతో జపాన్ దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు.

అక్కడి వ్యవసాయ క్షేత్రాలను అధ్యయనం చేశామన్నారు. జపాన్ ప్రధానికి తాను శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇచ్చానని, బాలాజీ ఆశీస్సులు ఉంటాయని తాను ప్రధానితో చెప్పానని తెలిపారు. ఏపీకి రావాల్సిందిగా జపాన్ ప్రధానిని కోరినట్లు చెప్పారు. జపాన్‌ను చూసి మనం నేర్చుకోవాలన్నారు. రోడ్లు చాలా పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ఇక్కడ బాగున్న రోడ్లు వెతకాలంటే సమస్యగా ఉంటే, జపాన్‌లో మాత్రం కాగితం ఉన్న రోడ్లు వెతకాలంటే సమస్య అన్నారు.

టెక్నాలజీలో జపాన్ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. రాజధాని నిర్మాణంలో సహకారానికి ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. తాను విదేశాలకు వెళ్లినప్పుడు.. అన్నింటిని స్టడీ చేస్తున్నట్లు చెప్పారు. జపాన్ పాపులేషన్ ప్లానింగ్‌లో ఫెయిలయిందన్నారు. త్వరలో జపాన్ జనాభా 12 కోట్ల నుండి పది కోట్లకు తగ్గుతుందన్నారు.

ఏపీలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించాల్సి ఉందన్నారు. ఏపీకి వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని చెప్పారు. ఎయిర్ కార్గో, రైలు కార్గో, రోడ్డు.. ఇలా అన్నింటిని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. జపాన్ పర్యటన సంతృప్తినిచ్చినట్లు చెప్పారు. అభివృద్ధి జరిగితే మహిళలకు ఉద్యగాలు వస్తాయన్నారు. పేదరికం తొలగి, మహిళలు చదువుకుంటే అభివృద్ధి సాధ్యమన్నారు.

కొద్ది రోజుల క్రితం తాను సింగపూర్ వెళ్లానన్నారు. హైదరాబాదును తొమ్మిదేళ్లలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశానని చెప్పారు. తాను పట్టుదలతో ఏపీ అభివృద్ధి కోసం వెళ్తున్నానని చెప్పారు. సోలార్ ఎనర్టీ రూ.4కు వస్తే ఏపీ బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి ఇచ్చేందుకు మన వద్ద విద్యుత్, భూమి, నీరు ఉందని, ఇక అనుమతులే ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

ఇండస్ట్రీ పాలసీ త్వరలో తీసుకు వస్తాం, సింగిల్ డెస్క్ విధానం...

తాము త్వరలో ఇండస్ట్రీ పాలసీని తీసుకు వస్తామని చెప్పారు. సింగపూర్ కంపెనీలతో కలిసి పని చేసేందుకు జపాన్ కంపెనీలకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పారిశ్రామికవేత్తల కోసం సింగిల్ డెస్క్ విధానం తీసుకు వస్తామన్నారు. ఒక వ్యక్తిని నియమించి, ఆయన ద్వారానే అన్ని అనుమతులు ఉంటాయని తెలిపారు.

రాజధాని కోసం పలు దేశాలు ముందుకు

రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉందని చెప్పారు. తాను చేసే కృషి ముందు తరాల కోసమన్నారు. ప్రణాళికా ప్రకారం సమయం వృథా చేయకుండా తాను జపాన్ దేశంలో పర్యటించానని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం పలు దేశాలు ముందుకు వస్తున్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+