వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొఫెషనల్, ఐటీపై మంచి పట్టుంది: లోకేష్‌పై చంద్రబాబు ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం ఐటీ వేదికగా నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఐటీ వినియోగంలో ఏపీ ఎంతో ముందుందన్నారు. ప్రపంచంలో వస్తోన్న నూతన ఐటీ ఒరవడులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నామన్నారు.

Recommended Video

ప్రత్యేక హోదా కోసం తాము చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం :లోకేష్

విజయవాడలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం దీనికి సంబంధించిన నిపుణులతో ముఖాముఖి కార్యక్రమాన్ని అమరావతిలోని ప్రజాదర్బర్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సాంకేతికతకు పెద్దపీట వేస్తోన్న ఏకైక ప్రభుత్వం తమదేనని చంద్రబాబు నాయుడు అన్నారు.

లోకేష్‌పై బాబు ప్రశంలు

లోకేష్‌పై బాబు ప్రశంలు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి లోకేష్‌కు టెక్నాలజీపై మంచి పట్టుందని చెప్పారు. మ‌న ఐటీ మంత్రి ప్రొఫెషనల్‌ అని, ఐటీలో లోకేష్‌కు మంచి పట్టుందని చెప్పారు. తాను మేనేజర్, లీడర్‌ను మాత్రమేనని.. సూచనలు ఇస్తుంటానని చెప్పారు.

మరింత పారదర్శకత

మరింత పారదర్శకత

తాజాగా ప్రారంభించిన ‘పెళ్లి కానుక' పథకంలోనూ సాంకేతికతకు పెద్దపీఠ వేస్తున్నామని చెప్పారు. సాంకేతికత సాయంతో పథకాలను మరింత పారదర్శకంగా అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో విజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. నాణ్యమైన దస్త్రాలను సాంకేతికత సాయంతో రూపొందిస్తున్నామని తెలిపారు.

విద్యార్థులకు బాబు సవాల్

విద్యార్థులకు బాబు సవాల్

అంతేగాక, ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థలను హ్యాక్‌ చేయాలని విద్యార్థులు, ఐటీ ఎక్స్‌పర్ట్‌లకు సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరారు. రాజధానిలో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, సైబర్ థ్రెట్ అడ్వయిజరీ పోర్టల్‌ను ప్రారంభించిన ఆయన ఎథిక‌ల్ హ్యాకింగ్ చేసి నిరూపిస్తే భారీ నజరానా ఇస్తామన్నారు.

దేశానికి దారి చూపే స్థాయికి

దేశానికి దారి చూపే స్థాయికి

కాగా, ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్‌లో దేశానికి దారి చూపే స్థాయికి ఏపీ చేరుతుందని మంత్రి లోకేశ్‌ అన్నారు. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, సైబర్ థ్రెట్ అడ్వయిజరీ పోర్టల్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 20 శాతం సెల్‌ఫోన్లు ఏపీలో తయారవుతున్నాయన్నారు. 2019 నాటికి 2లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని చెప్పారు. ఫిన్‌టెక్‌, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటాలపై దృష్టి సారించామని లోకేశ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్‌లో దేశానికి దారిచూపే స్థాయికి ఏపీ చేరుతుందని మంత్రి లోకేశ్‌ అన్నారు. ప్రస్తుతం 20శాతం సెల్‌ఫోన్లు ఏపీలో తయారవుతున్నాయన్నారు. 2019 నాటికి 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని తెలిపారు. ఫిన్‌టెక్‌, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటాలపై దృష్టి సారించామని చెప్పారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Monday praised IT minister Nara Lokesh for IT development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X