తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాదాభివందనం చేస్తున్నా: బాబు, నావల్లే అవుతుంది, విభజన-హైద్రాబాద్‌పై..

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరుపతి: మహానాడు వేదిక పైన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం మాట్లాడారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏపీపై విభజన ఎఫెక్ట్, విభజన హామీలు, ఏపీలో ఇబ్బందులు తదితర ఎన్నో అంశాలపై మాట్లాడారు.

మహానాడులో నేనూ ఓ కార్యకర్తనే అని చంద్రబాబు అన్నారు. నాడు ఎన్టీఆర్ సమాజం కోసం, కొత్త ఒరవడి కోసం ఆలోచించారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పారన్నారు. అందుకే తెలుగుజాతికి మహానాడు పండుగ రోజు అన్నారు.

టిడిపి కార్యకర్తలు చేసుకునే ఏకైక పండుగ మహానాడు అన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది ప్రజల కోసం అన్నారు. తెలుగు జాతి కోసం, కార్మికుల కోసం, అన్నార్తుల కోసం పుట్టిన పార్టీ టిడిపి అన్నారు. తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.

ప్రతిపక్షాల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు

ఎన్నో జెండాలు వచ్చాయి, ఎన్నో పార్టీలు వచ్చాయి... జెండాలు పీకేశారు, పార్టీలు కనుమరుగయ్యాయని, కానీ టిడిపి మాత్రం ఎప్పటికీ ఉంటుందన్నారు. టిడిపికి, మన నాయకుడికి గుర్తింపు వచ్చిందంటే అది కార్యకర్తల త్యాగం వల్లనే అని చెప్పారు. ఎంతోమంది ఆస్తులను పార్టీ కోసం ఖర్చు పెట్టారన్నారు.

ప్రతిపక్షం దాడులు చేస్తే ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. కానీ ఎప్పుడు వెన్నుచూపలేదన్నారు. అలాంటి వారి కోసం మనం అభినందనలు తెలియజేయాలని, నివాళలు అర్పించాలన్నారు. కొందరిని ప్రతిపక్ష పార్టీ వారు కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారన్నారు. అలాంటి వారి పోరాటం వృధాగా పోవద్దన్నారు.

పాదాభివందనం

ప్రాణాలు పోయినా, ఎంతో ఖర్చు చేస్తూ పార్టీని నిలబెట్టిన వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. నేను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను అన్నారు. అందుకే కార్యకర్తలా పసుపు పచ్చ దుస్తులతో వస్తానని చెప్పారు. కార్యకర్తలకు నేను స్ఫూర్తిగా ఉంటానన్నారు.

నేను మొదటి సేవకుడిని

క్రమశిక్షణకు మారుపేరు ఎన్టీఆర్ అన్నారు. ఆయన స్ఫూర్తి మనకు ఉందన్నారు. టిడిపికి ఒక బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా నేను వ్యవహరిస్తున్నానని చెప్పారు. నేను పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా పార్టీలో పని చేయడం లేదన్నారు. పార్టీని కుటుంబంలో చూస్తున్నానని చెప్పారు.

పార్టీకి నేనే మొదటి సేవకుడిని అని చెప్పారు. పార్టీ చరిత్ర ఆలోచించాల్సిన అవసరముందన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే గెలిచారని, ఆ తర్వాత ఆగస్టు సంక్షోభం వచ్చిందన్నారు. కానీ ఆ తర్వాత ప్రజలు మళ్లీ సీఎంగా ఆయనను గెలిపించారన్నారు. ఆ తర్వాత ఎన్నో సంక్షోభాలు మనం చవి చూశామన్నారు.

ఓ ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన ఏకైక పార్టీ టీడీపీయే అన్నారు. మనం ఎన్నో సమస్యలను ఇన్నాళ్ల కాలంలో చవి చూశామన్నారు. ప్రజల కోసం సినిమాలను వదులుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.

విభజనపై..

విభజన ఇష్టానుసారంగా చేస్తున్నారని నేను దీక్ష చేశానని చెప్పారు. ఎన్నో సమస్యల పైన పోరాడానని చెప్పారు. టిడిపి అంటేనే త్యాగాలకు మారుపేరు అన్నారు. ఈ రోజు ఆహారభద్రత గురించి మాట్లాడుతున్నారని, కానీ ఎన్టీఆరే ఆహార భద్రత తీసుకు వచ్చారన్నారు.

హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టిన పార్టీ టిడిపి అన్నారు. హైదరాబాదులో బ్రహ్మాండమైన రోడ్లు, విమానాశ్రయాలు ఇలా అన్నీ ఉన్నాయంటే టీడీపీయే కారణమన్నారు. తెలుగు జాతి బాగుండాలనే నాడు హైదరాబాదులో అవి చేశానని చెప్పారు.

తెలుగువారు ఎక్కడున్నా..

టిడిపి తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ అన్నారు. తెలుగువారికి ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడే పార్టీ టిడిపి అన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడున్నా మనం తెలుగువారిని కాపాడుకుంటామని చెప్పారు. విభజన తర్వాత తొలి మహానాడు హైదరాబాదులో ఏర్పాటు చేశామన్నారు.

తిరుపతి మహానాడుకు చరిత్ర ఉందన్నారు. విభజన తర్వాత మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. విభజన తర్వాత పార్టీ తెలంగాణలో, ఏపీలో ఉందని, అలాగే కేంద్రంలో ఎన్డీయేలో ఉన్నామని చెప్పారు. తెలంగాణలో పార్టీలో బలోపేతం చేసుకోవాలన్నారు. విభజన తర్వాత ఏపీకి ఎన్నో చిక్కులు ఉన్నాయన్నారు.

Chandrababu praises NTR on Mahanadu and lashes out at opposition

హైదరాబాద్ మనవల్లే

హైదరాబాదును ఉద్యోగాలు కల్పించే నగరంగా టీడీపీయే చేసిందన్నారు. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధానిని, ఏపీని కూడా అలా చేసుకోవాల్సిన అవసరముందన్నారు. కొత్త రాష్ట్రాన్ని సమస్యలతో ప్రారంభిస్తున్నామని చెప్పారు. నాడు 1996లో ఏపీలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అన్నారు.

కానీ హైదరాబాదును, సమైక్య ఏపీని అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు కూడా విభజన తర్వాత నవ్యాంధ్ర అంతకంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. వాటన్నింటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్పారు.

నేను, టిడిపి తప్ప ఎవరూ చేయలేరని..

ఏపీ పైకి వచ్చే వరకు ఆదుకుంటామని నాడు కేంద్రం చెప్పిందన్నారు. కానీ విభజన చట్టంలో నాటి కాంగ్రెస్ పార్టీ పెట్టలేదన్నారు. దాంతో సమస్యలు వస్తున్నాయన్నారు. విభజన నేపథ్యంలో ఏపీని చంద్రబాబు, టీడీపీ తప్ప ఎవరూ చేయలేరని ప్రజలు మనల్ని గెలిపించారన్నారు.

ఏపీ ప్రజలు మన పైన పెద్ద బాధ్యతను పెట్టారన్నారు. దీనిని మనం బాగా గుర్తుంచుకోవాలన్నారు. సంక్షోభాన్ని అవకాశాలుగా మార్చుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నానని చెప్పారు. నేను దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నానన్నారు.

నెంబర్ వన్ చేస్తా

నాడు సమైక్య ఏపీని నెంబర్ వన్ చేశానని, ఇప్పుడు విభజన నేపథ్యంలో ఏపీని మళ్లీ నెంబర్ వన్ చేస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మనం తెలుగు వారికి న్యాయం చేయాలన్నారు. ఏపీలో, తెలంగాణలో, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా న్యాయం చేయాలన్నారు.

ప్రపంచంలో మనం ఎక్కడకు పోయినా.. వీళ్లు తెలుగు వారు అని చెప్పాలంటే.. భాషతోనే గుర్తిస్తారని చెప్పారు. భారతీయులు అని చెప్పాలంటే సంస్కృతి, సంప్రదాయాలతో చెబుతారన్నారు. తెలుగును కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. మన పార్టీలోనే తెలుగు ఉందని చెప్పారు.

కష్టాలున్నాయనలేదు ఎన్నికల్లో హామీ ఇచ్చాం

విభజన నేపథ్యంలో కష్టాలున్నాయని నేను వెనక్కి పోలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నింటిని నెరవేర్చుతున్నామని చెప్పారు. పింఛన్లు పెంచిన ప్రభుత్వం మనది ఒక్కటే అన్నారు. ఆసుపత్రుల్లో ప్రక్షాళన చేశామన్నారు. సంచార వైద్యశాలలు వంటివి పెట్టామన్నారు.

విద్యాపరంగా ముందుకు పోతే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వారికి గిట్టుబాటు ధర లేదన్నారు. దీంతో వారి నడ్డి విరిగిందన్నారు. అందుకే ఏపీలో రైతులకు లక్షా యాభై వేల రూపాయల చొప్పున రుణ విముక్తి చేశామన్నారు.

స్వతంత్ర్యం వచ్చాక ఇలా చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఒక్కటే అన్నారు. మన వద్ద డబ్బులు లేకున్నప్పటికీ.. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రణాళికలో పెట్టకపోయినప్పటికీ.. పండ్ల తోట రైతులకు కూడా రుణమాఫీ చేశామన్నారు. మరోసారి రెండో విడత ఇస్తున్నామని చెప్పారు.

రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం

మనకు ఇప్పుడు ఎక్కడా కరెంట్ కొరత లేదన్నారు. నీటి నిలువ కోసం ఎన్నో చేస్తున్నామన్నారు. పట్టిసీమను సంవత్సరంలో పూర్తి చేశామన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామన్నారు. దీంతో ఒకప్పటి రాళ్ల సీమ, రతనాల సీమ అవుతుందన్నారు. కాంగ్రెస్ రాళ్ల సీమ చేస్తే మేం రతనాల సీమ చేస్తామన్నారు. మేం సీమకు నీళ్లు సుసాధ్యం చేస్తామన్నారు.

డ్వాక్రా సంఘాలు కాంగ్రెస్ హయాంలో నిర్వీర్యమయ్యాయని చెప్పారు. తెలంగాణలో ఉన్నన్ని డ్వాక్రా సంఘాలు ఎక్కడా లేకుండె అన్నారు. కాంగ్రెస్ వాటిని నిర్వీర్యం చేసిందన్నారు. ఈ ఏడాది ప్రతి ఇంటికి వంటగ్యాస్ ఇస్తామని చెప్పారు. హైదరాబాదును ప్రపంచపటంలో నిలిపింది మనమే అన్నారు. మైనార్టీ సోదరులకు న్యాయం చేస్తున్నామన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతామన్నారు.

కాపులపై..

పేద కాపులకు కార్పోరేషన్ ఏర్పాటు చేశామని, కాపు కార్పోరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రిజర్వేషన్ కోసం కమిషన్ పని చేస్తుందని చెప్పారు. సర్వే కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నూతన రాజధాని అమరావతిలో పెడతామని మనం మొదటే చెప్పామన్నారు. అవినీతి ఎక్కడా లేకుండా చూడాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉందన్నారు. ఈ సందర్భంగా ఇసుక పాలసీని చంద్రబాబు ప్రస్తావించారు. ఇసుకను ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పైన చర్యలు తీసుకున్నామన్నారు.

యువత కోసం విదేశాలకు వెళ్తున్నా

యువత కోసం తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. విదేశాలకు వెళ్తున్నానని, పెట్టుబడులు తీసుకు వస్తున్నానని చెప్పారు. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నాలు
చేస్తున్నామన్నారు. పేదల కోసమే మేం పని చేస్తున్నామన్నారు.

విభజన కష్టాలు..

విభజన కష్టాలు ఏపీని వెంటాడుతున్నాయన్నారు. ఖర్చు పెట్టేందుకు కూడా డబ్బులు లేవన్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యం అంటే.. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. విభజన జరిగి రెండేళ్లయినా ఏపీకి ఆదాయం లేదన్నారు. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న పార్టీ దక్షిణ భారతంలో ఏపీయే అన్నారు. మనకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, ఆదాయం తక్కువగా ఉందని చెప్పారు.

విభజన చట్టంలోని హామీలను కేంద్రం కచ్చితంగా నెరవేర్చాలన్నారు. అలాగే మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ వచ్చే వరకు కేంద్రం సహకరించాలని తాను కోరుతున్నానని చెప్పారు. కొందరు తనను ప్రశ్నిస్తున్నారని (ప్రత్యేక హోదాపై) కానీ రాజకీయాలు సరికాదన్నారు. అందరం కలిసి పోరాడాలన్నారు.

English summary
Chandrababu praises NTR on Mahanadu and lashes out at opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X