బిజెపితో పొత్తు: చంద్రబాబు తాడోపేడో , పవన్ కల్యాణ్‌పై ధీమా?

అమరావతి: బిజెపితో పొత్తుపై ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడినట్లు కూడా అనిపిస్తున్నారు.

Recommended Video

    ముందస్తు ఎన్నికలు : పవన్ కల్యాణ్‌కు మోడీ సంకేతాలు

    శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే, బిజెపితో చంద్రబాబు విసిగిపోయి అలా అన్నారా, నిజంగానే తెగదెంపులకు తెగించారా అనేది అర్థం కావడం లేదు. శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం బిజెపికి హెచ్చరిక చేసినట్లుగానే ఉన్నాయి.

     బిజెపి నేతల విమర్శలు ఇలా...

    బిజెపి నేతల విమర్శలు ఇలా...

    చంద్రబాబు ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు పట్టువిడవకుండా విమర్శలు చేస్తున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నాయకులు కూడా తరుచుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధానంగా దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శలు చేస్తున్నారు.

     తాజాగా సోము విర్రాజు విమర్శలు...

    తాజాగా సోము విర్రాజు విమర్శలు...

    తాజాగా శనివారంనాడు కూడా సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మద్యం మాఫియాలను అరికట్టలేకపోతోందని విమర్శించారు.

     వ్యూహాత్మకంగా చంద్రబాబు

    వ్యూహాత్మకంగా చంద్రబాబు

    బిజెపితో పొత్తుపై చంద్రబాబు వ్యూహాత్మకంగానే వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. బంతిని బిజెపి కోర్టులో పడేయడం ఆయన వ్యూహంగా తోస్తోంది. పొత్తు వద్దనుకుంటే ఓ నమస్కారం పెట్టేయండని ఆయన బిజెపి నాయకత్వానికి సూచించారు. మిత్ర ధర్మం కాబట్టి తాము మాట్లాడడం లేదని కూడా అన్నారు.

     జగన్ ప్రకటన నేపథ్యంలో బాబు

    జగన్ ప్రకటన నేపథ్యంలో బాబు

    ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో కలిసి నడవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ప్రకటన కూడా చంద్రబాబు ఆ సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణమైందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. బిజెపి జగన్ వైపు చూస్తుందనే అనుమానం వల్ల స్పష్టత కోసం ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది.

    పవన్ కల్యాణ్ కలిసి వస్తారని...

    పవన్ కల్యాణ్ కలిసి వస్తారని...

    వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలుపుకుని నడవాలనే ప్రణాళిక కూడా చంద్రబాబుకు ఉండవచ్చునని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు కూడా చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఎక్కువ తప్పుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తనతో కలిసి వస్తారనే ధీమా కూడా చంద్రబాబుకు ఉండవచ్చునని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+