ఐఎస్‌బీలా: సింధుతో బాబు బ్యాడ్మింటన్, కేసీఆర్‌పై ముప్పేటదాడి

హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) తరహాలో క్రీడల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడలో అన్నారు. తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

క్రీడలు జీవితంలో భాగం కావాలని సూచించారు. దేశంలో క్రీడాకారులకు కొరత లేదని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో ఏపీ అగ్రగామిగా ఉండాలన్నారు. విజయవాడలోని డీఆర్ఆర్ ఆడిటోరియం అభివృద్ధికి రూ.కోటిన్నర మంజూరు చేసినట్లు చెప్పారు. ఒలింపిక్స్‌లో ఎక్కువ పతకాలు సాధించేలా క్రీడాకారులు కృషి చేయాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వని విధంగా క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించిందన్నారు.

జాతీయ క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన వారికి రూ.7లక్షలు, రజత పథకం సాధించిన వారికి రూ.5లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.3లక్షల నజరానాను ప్రకటించామన్నారు. గత ప్రభుత్వాలు క్రీడా రంగాన్ని అవినీతిమయం చేశారని, తమ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. దేశంలో క్రీడాకారులకు కొరత లేదని, తెలుగు క్రీడాకారులు ఏపీకి మంచిపేరు తెచ్చారన్నారు. కాగా, చంద్రబాబు పీవీ సింధుతో బ్యాడ్మింటన్ ఆడారు.

Chandrababu promises ISB type sports school

కేసీఆర్ పైన టీడీపీ, కాంగ్రెస్ నిప్పులు

వాస్తు బాగా లేదని సచివాలయం మార్చుతామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్, టీడీపీలు మండిపడుతున్నాయి. టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్ రమణ తదితరులు మాట్లాడుతూ.. వాస్తు దోషం పేరుతో సచివాలయం తరలింపు సరికాదన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవడమే తెలంగాణకు పట్టిన దోషమన్నారు.

చెస్ట్‌ ఆస్పత్రి తరలింపును అడ్డుకునేందుకు ఉద్యమానికైనా సిద్ధమేన్నారు. కేసీఆర్‌ పేరు తలిస్తే పిచ్చి తుగ్గక్‌, నియంతృత్వ వాధి, మానసిక వ్యాధి గ్రస్తులు గుర్తుకువస్తున్నారన్నారు. కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలకు ఇళ్ళు కట్టించలేని కేసీఆర్‌ కేరళ వాళ్లకు ఎలా కట్టిస్తారని ప్రశ్నించారు. వాస్తు బాలేనిది సచివాలయానికి కాదు.. కేసీఆర్‌కే వాస్తు బాలేదన్నారు. ప్రస్తుతమున్న సచివాలయంలోనే తెలంగాణ ఆవిర్భావానికి నాంది పడిందన్నారు. సచివాలయ మార్పు పేరుతో ప్రజలపై ఆర్ధిక భారం మోపే ఆలోచన సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+