7మండలాల బాధ్యత నాదేనన్న బాబు, సంక్రాంతి గిఫ్ట్
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఏపీలో విలీనం అయిన ఏడు మండలాల బాధ్యతను తానే తీసుకుంటానని సీఎం చంద్రబాబు చెప్పారు. పరిపాలనా పరంగానూ, సాంకేతికంగా తాము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు.
ఆయన ఏడు మండలాల ప్రజా ప్రతినిధులు, నేతలతో ఆయన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. ముంపునకు గురయ్యే ఈ ఏడు మండలాల ప్రజలకు మంచి పరిహారం అందించేలా తాను కృషి చేస్తానన్నారు. రెండు ఐటిడిఎ ప్రాజెక్టులను అమలుచేస్తామన్నారు.
చింతూరు, కూనవరం, విఆర్ పురం, భద్రాచలం, కుకునూర్, వేలేరుపాడు, బూర్గంపహాడ్ మండలాల ప్రజలకు న్యాయం చేసే బాధ్యత తనదే అన్నారు. ఈ మండలాల అభివృద్ధికి తాత్కాలిక ప్రణాళిక అమలుచేస్తామని, తర్వాత దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రణాళిక తయారుచేస్తామన్నారు. ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

చంద్రన్న సంక్రాంతి కానుక
పేదవారి సంతోషమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఉత్సవాల సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట 240 రూపాయిలు విలువ చేసే నిత్యావసరాలను ప్రభుత్వం ఉచితంగా పేదలకు అందజేస్తుంది.
7వ తేదీ నుండి 12వ తేదీ వరకూ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పనిలో పనిగా సంక్రాంతి కానుక అందజేయడం, రైతుల రుణమాఫీపై ఆరా, రాజధాని నిర్మాణంపై అభిప్రాయాలు, స్మార్టు సిటీల అంశం ఈ చర్చలో ప్రస్తావనకు వస్తాయి.
గోదుమలు, సెనగలు, మినపపప్పు, పెసరపప్పు, వంద గ్రాముల నెయ్య కూడా సంక్రాంతి కానుకగా తెల్లకార్డులున్న వారందరికీ ఇస్తారు. వారం రోజుల పాటు ప్రభుత్వ పథకాలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు, పంటల దిగుబడి ఎక్కువగా సాధించిన రైతులను సన్మానించుకోవడం, ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన వారిని పిలిచి అభినందించుకోవడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications