తరిమి కొడ్తాం: చంద్రబాబు, జగన్‌పై ఫైర్, రిషికేశ్వరి మృతిపై నివేదిక
హైదరాబాద్: ర్యాగింగ్ భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొడతామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య పైన వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
స్టాప్ ర్యాగింగ్.. స్టార్ట్ ఫ్రెండ్ షిప్ పేరుతో టిఎన్ఎస్ఎఫ్ తయారు చేసిన పోస్టర్‌ను చంద్రబాబు శనివారం ఆవిష్కరించారు. ఆడబిడ్డలను కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వం ముందు ఉంటుందని, వారి రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడబోమని, నిర్భయ కన్నా పదునైన చట్టం తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు.

ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించి యువతులకు ధైర్యం చేకూర్చాలని టిఎన్ఎస్ఎఫ్ నేతలకు చంద్రబాబు సూచించారు. కాగా, నాగార్జునవర్సిటీ విద్యార్థిని రిషికేశ్వరి మృతి పైన విచారణ జరిపిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ శనివారం చంద్రబాబును కలిసి మధ్యంతర నివేదకను అందించింది.
కమిటీతో కలిసి నివేదిక అందజేసిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాస రావు విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు ర్యాగింగ్ పేరు ఉచ్ఛరించేందుకే భయపడేవిధంగా నిర్భయ కన్నా కఠినమైన చట్టాన్ని తీసుకు వస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో బయట వాళ్లకు ప్రవేశం లేకుండా చేస్తామని తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రిషికేశ్వరి ఘటనలో ప్రిన్సిపల్ బాబురావు ప్రవర్తన తెలిసిన వెంటనే ఆయనను సస్పెండ్ చేశామన్నారు. రిషికేశ్వరి డైరీని పూర్తిగా పరిశీలించి, దానిలోని అంశాలపై పారదర్శక దర్యాఫ్తు జరుగుతోందన్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకుంటామన్నారు.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications