అడ్డదారులు నచ్చవు: బాబు, బిజెపి పొత్తుపై స్పందన

పద్ధతి ప్రకారం ఆస్తులు సంపాదించుకుంటే ఏమీ కాదని, అడ్డదారిలో సంపాదించడం సరికాదన్నారు. అడ్డదారిలో సంపాదించడం తనకు ఇష్టముండదని చెప్పారు. తాము ఈ నెల 20, 21వ తేదీల్లో ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాటిని చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తామంటే జగన్ పార్టీ రాజకీయం చేస్తోందన్నారు.
భారతీయ జనతా పార్టీతో పొత్తుపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు. ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందన్నారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో ఉద్యమాల నేపథ్యంలో ఐక్యకార్యాచరణ సమితి నాయకులను కూర్చోబెట్టి మాట్లాడాలన్నారు. వారికి పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఆర్టీఏ కమిషనర్లను రిలీవ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో తాను దివంగత ప్రధానమంత్రి పివి నర్సింహా రావు ఘాట్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. హవాలా మార్గంలో వచ్చే ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే అవినీతి నిర్మూలన సాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications