రాజమౌళి మంచి సూచనలు చేశారు, జగన్‌లో సీరియస్‌నెస్ లేదు, నిధులతో ఇబ్బంది: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వ‌చ్చిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అసెంబ్లీ మిన‌హా రాజ‌ధాని భ‌వనాల ఆకృతులు ఖ‌రారు అయ్యాయ‌న్నారు.

సంక్రాంతికి రాజ‌ధానిలో శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ముందన్నారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మంచి సూచ‌న‌లు చేశార‌ని, ఈ విషయంలో ఆయన కీలకంగా వ్య‌వ‌హ‌రించారన్నారు.

Chandrababu responds on ss rajamouli and ys jagan padayatra

మ‌రో 40 రోజుల్లో అసెంబ్లీ ఆకృతులను పూర్తిగా ఖ‌రారు చేస్తామ‌ని చెప్పారు. పోల‌వ‌రం నిర్మాణానికి నిధుల‌ ఇబ్బంది ఉందని, త్వ‌ర‌లోనే ఆ అడ్డంకులు తొల‌గిపోతాయని ముఖ్యమంత్రి అన్నారు.

వైసిపి అధినేత వైయస్ జగన్ పాదయాత్ర పైన కూడా చంద్రబాబు స్పందించారు. జగన్ పాదయాత్రలో సీరియస్‌నెస్ లేదని చెప్పారు. పోలవరం నిర్మాణానికి నిధులతో ఇబ్బంది ఉందని, త్వరలోనే అడ్డంకులు తొలగిపోతాయన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu responds on ss rajamouli and ys jagan padayatra.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి