ఆస్తులు వెల్లడించిన చంద్రబాబు: వాటా ఇస్తానని సవాల్

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను ఆయన మీడియా ముందుంచారు. చంద్రబాబు ఆస్తుల విలువ రూ.42.06 లక్షలుగా ఉంది.

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.3305.02 లక్షలు, తనయుడు నారా లోకేష్ ఆస్తుల విలువ రూ.492.53 లక్షలు, కోడలు నారా బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ.330.69 లక్షలుగా ఉంది. తన హెరిటేజ్ కంపెనీ పారదర్శకంగా ఉందని, ఆ సంస్థ విలువ రూ.148.89 కోట్లుగా ఉందని చెప్పారు.

హెరిటేజ్ సంస్థ ఈ ఏడాది ముప్పై శాతం డివిడెంట్ చెల్లించిందన్నారు. 1992లో తాము హెరిటేజ్ సంస్థను స్థాపించామని, దానిని పద్ధతి, విలువలతో నడుపుతున్నందున అభివృద్ధి చెందుతోందన్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌ను వృత్తి నిబద్ధతతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పద్ధతి, విలవలతో నిర్వహించడం వల్లనే ఆ సంస్థ వృద్ధి చెందుతోందన్నారు. గతేడాదితో పోలిస్తే సంస్థ వృద్ధి రేటు 14.96 శాతంగా ఉందని చెప్పారు. హెరిటేజ్ సంస్థపై ఎవరి దయాదాక్షిణ్యాలు లేవన్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజలకు జవాబుదారిగా ఉండాలనే తాను తన ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

రాజకీయ నాయకులు అందరూ తమ ఆస్తులను ప్రకటించాలన్నారు. తాను ప్రకటించిన వాటికంటె ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే వారికి తన వాటాను ఇచ్చేస్తానని బాబు సవాల్ చేశారు. సింగపూర్‌లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెప్పారు. తాను పద్ధతి ప్రకారం సంపాదిస్తున్నానని, అడ్డదారుల్లో సంపాదించడం లేదన్నారు.

అవినీతి వల్ల పారిశ్రామిక రంగం కుంటుపడి రూపాయి విలువ పడిపోయిందన్నారు. విలువలు తగ్గడం, అవినీతి పెరగడం వల్లనే దేశంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. మైనింగ్, ఎస్ఈజడ్‌ల పేరిట సంపాదన సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+