శంఖం పూరించి..కత్తి చూపిన బాబు: టోపీ పెట్టి(పిక్చర్స్)

హైదరాబాద్/మెదక్: కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు అవినీతికి జట్టుగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సుస్థిరమైన, సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని అందించేవి కేంద్రంలో ఎన్డీఏ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ కూటములేనని అన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు చివరి రోజులంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి హెచ్చరిక చేశారు.

నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, కరెంటు, ఉద్యోగం లాంటి అనేక సమస్యలున్నాయని, బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ, నవ తెలంగాణ నిర్మాణానికి టిడిపి-బిజెపి కూటములకు అధికారమివ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రజాగర్జన పేరుతో ఇబ్రహీంపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

పదేళ్లుగా రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని టిడిపి-బిజెపి అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు. కెసిఆర్‌కు, కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి, దాచుకోవడానికే ప్రజల ముందుకు వస్తున్నారని ఆ పార్టీని నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. సీమాంధ్ర తెలంగాణ ప్రాంతాలను అభివృద్ధిలోకి తెచ్చేందుకు తమకు అధికారం ఇవ్వాలంటూ చంద్రబాబునాయుడు కోరారు. ఈ సభలో భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపి అభ్యర్థి నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

హాజరైన జనం

హాజరైన జనం

కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆదివారం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సభలకు భారీగా జనాలు తరలివచ్చారు.

శంఖం పూరిస్తూ..

శంఖం పూరిస్తూ..

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు అవినీతికి జట్టుగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

బాబు ప్రసంగం

బాబు ప్రసంగం

సుస్థిరమైన, సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని అందించేవి కేంద్రంలో ఎన్డీఏ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ కూటములేనని అన్నారు.

టోపీ పెట్టుకుని కత్తితో..

టోపీ పెట్టుకుని కత్తితో..

మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు చివరి రోజులంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి హెచ్చరిక చేశారు.

రోడ్ షోలో..

రోడ్ షోలో..

నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, కరెంటు, ఉద్యోగం లాంటి అనేక సమస్యలున్నాయని, బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ, నవ తెలంగాణ నిర్మాణానికి టిడిపి-బిజెపి కూటములకు అధికారమివ్వాలని చంద్రబాబు ప్రజలను కోరారు.

రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లాలో..

పదేళ్లుగా రైతులు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని టిడిపి-బిజెపి అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. బాబు వెంట దేవేందర్ గౌడ్, ఇతర నేతలు.

రోడ్ షోకు హాజరైన జనం

రోడ్ షోకు హాజరైన జనం

పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి అసమర్ధత రాజ్యమేలిందని, ఎన్నికలొచ్చే సరికి రెండు సార్లు సోనియా గాంధీ, రెండుసార్లు రాహుల్ గాంధీ, ఓసారి ప్రధాని మన్మోహన్‌సింగ్ వచ్చి తామేదో వెలగబెడతామని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందని చంద్రబాబు విమర్శించారు.

తమ్ముళ్ల నినాదాలు..

తమ్ముళ్ల నినాదాలు..

కాంగ్రెస్ పాలనలో రూపాయి విలువ పడిపోయిందని నిత్యావసర వస్తువుల ధరలు పేదలకందకుండా పోయాయని, ప్రాపర్టీ టాక్స్, కరెంటు చార్జీలు పెంచారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+