నేనున్నా:సిఎంపై బాబు, టిడిపిలోకి ఎమ్మెల్యే చంద్రావతి!

Chandrababu says he is Seemandhra CM candidate
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజలు తమ భవిష్యత్తు కోసం తాను ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకొంటున్నారని, అందుకే అక్కడ సిఎం పదవి వేరొకరికి ఇస్తానని చెప్పలేకపోతున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. అభివృద్ధిలో తన ట్రాక్ రికార్డ్ అందరికీ తెలుసునని, అందుకే ఆ ప్రాంతంలో తానే రావాలని కోరుకొంటున్నారని, ఇది బహిరంగ రహస్యమన్నారు.

జగన్ గెలవాలని కోరుకొనేవారే తమ పార్టీ తరపున వేరే సిఎం అభ్యర్థి పేరు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని, తాను మోసం చేసే మనిషిని కాదన్నారు. కెసిఆర్‌లా దళితుడిని సిఎం చేస్తానని చెప్పి దాటవేయలేదన్నారు. తెలంగాణలో అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం అమలు చేస్తామని చెప్పామని, రెండుచోట్లా గెలుస్తామన్నారు.

సీమాంద్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వైపు జోరుగా వలసలు వస్తున్న విషయం తెలిసిందే. విశాఖ జిల్లాలోని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం టిడిపిలో చేరనున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాస రావు, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేశ్ బాబు, కన్నబాబు రాజులు బుధవారం చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.

సీమాంధ్రను అభివృద్ధి చేయడం చంద్రబాబుకే సాధ్యమని, అందుకే టిడిపిలో చేరుతున్నానని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చెప్పారు. తాను టిడిపిలోకి వెళ్తానని, ఆ అవకాశం లేకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు.

తెలంగాణలోను...

తెలంగాణ ప్రాంతంలోను టిడిపిలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ(ఎస్టీ) సిపిఐ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని సిపిఐ నాయకత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రచారం జరగటంతో ఆమె టిడిపిలో చేరాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. అయితే, తాను టిడిపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను చంద్రావతి ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+