మళ్లీ మళ్లీ రానని మోడీకి చెప్పా, దసరాకు సెక్రటరియేట్లోకి: బాబుకు 'ప్రత్యేక' డౌట్

అమరావతి: పదేపదే తాను కేంద్రం చుట్టూ తిరగబోనని ప్రధాని నరేంద్ర మోడీకి తాను చెప్పానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు అన్నారు. విజయదశమి రోజున సచివాలయంలోని తన ఛాంబర్‌లోకి ప్రవేశిస్తానని చెప్పారు. చంద్రబాబు గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే క్రమంలో ఇక నుంచి ప్రతి సోమవారాన్ని పోలవారంగా పరిగణిస్తామన్నారు. 2018 నాటికి పోలవరంను పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. విభజన కష్టాలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు.

Chandrababu Naidu

దేశవ్యాప్తంగా వచ్చిన 954 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల్లో 15.8 శాతం ఏపీకి వచ్చినట్లు ఆర్బీఐ నివేదిక చెబుతోందన్నారు. నీటి భద్రత కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, వాటర్‌, ప్రాజెక్టుల నెట్‌వర్క్‌ ద్వారా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళిని అనుసంధానం చేస్తామన్నారు.

అపెక్స్‌ కౌన్సిల్‌లో సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమన్నారు. గోదావరి ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విభజన హామీల పరంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు కల్పించాలని ప్రధాని మోడీని కోరామన్నారు.

చంద్రబాబుకు డౌట్!

ప్రత్యేక హోదా పైన చంద్రబాబు మరోసారి స్పందించారు. ప్రత్యేక హోదా రావడం వల్ల ఉపయోగం ఏమిటో తనకు తెలియదని, అందుకే మిమ్మల్ని చెప్పమన్నాను అని ఆయన వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రాయితీకి, ప్రత్యేక హోదాకు సంబంధం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+