మోడీది, నాది విన్ విన్ సిచ్యుయేషన్: చంద్రబాబు

హైదరాబాద్: తనదీ, నరేంద్ర మోడీదీ విన్ విన్ సిచ్యుయేషన్ సృష్టించే జంట అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాదులో పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీతో కలిసి ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. తాను ఐటిని అభివృద్ధి చేశానని, నరేంద్ర మోడీకి సాంకేతిక పరిజ్ఞానం అపారంగా ఉందని ఆయన అన్నారు. పదేళ్ల కాంగ్రెసు పాలన దేశాన్ని భ్రష్టు పట్టించిందని ఆయన అన్నారు. సోనియా అవినీతికి అండగా నిలిచారని ఆయన విమర్శించారు.

అవినీతి కారణంగా దేశం దెబ్బ తినే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అభివృద్ధి ఆగిపోయిందని ఆయన అన్నారు. మోడీ అధికారంలోకి వస్తే తప్ప ఉద్యోగాలు రావని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది తమ పార్టీయేనని ఆయన అన్నారు. మోడీ రావాలి, దేశం బాగుపడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ జిల్లాలో తమకు మద్దతుగా యువత ముందుకు వస్తోందని ఆయన అన్నారు.

Babu - Modi

బిజెపి, తెలుగుదేశం అధికారంలోకి రావాలని తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న యువత ముందుకు వస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసులో నాయకత్వం లేదని ఆయన అన్నారు. ఎన్డియె సహకారంతో హైదరాబాదును అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. తెరాస మూడో కూటమి గురించి మాట్లాడడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.

కేంద్రంలో మూడుసార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు తెలుగుదేశం సహకారంతోనే ఏర్పడ్డాయని ఆయన అన్నారు. తెరాస మాటలు మాట్లాడుతోందని, మనం చేసిన అభివృద్ధిని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకున్నారని ఆయన విమర్సించారు. తెలంగాణ వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుజాతి కలిసి ఉండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.

నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని ఆయన అన్నారు. దేశాన్ని మోడీ చైనాకు, అమెరికాకు ధీటుగా అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలనకు, దేశాభివృద్ధికి మోడీ ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు. చాయ్ అమ్ముతాను గానీ దేశాన్ని అమ్మబోనని మోడీ అన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ తెగువ, సమర్థత మోడీకి ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+