• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారసులకు టికెట్లు-చంద్రబాబు సై-జగన్ నో-2024లో పడే ప్రభావమెంత ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్న అధికార, విపక్ష నేతలు వైఎస్ జగన్, చంద్రబాబు ఓ కీలక విషయంలో పూర్తి క్లారిటీతో ముందుకెళ్తున్నారు. అదే వారసులకు టికెట్లు. వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్ల కేటాయింపు విషయంలో వైఎస్ జగన్ నో అంటుంటే చంద్రబాబు మాత్రం సై అంటున్నారు. దీంతో ఈ నిర్ణయాల ప్రభావం వచ్చే ఎన్నికలపై ఏ స్ధాయిలో ఉంటుందన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది.

ఏపీలో వారసులకు టికెట్లు

ఏపీలో వారసులకు టికెట్లు

ఏపీలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న నేతల్లో చాలా మంది వచ్చే ఎన్నికల్లో తమకు బదులుగా తమ వారసుల్ని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వారిని రంగంలోకి దించడమే కాకుండా గడప గడపకూ తిప్పేస్తున్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ ఇద్దరూ ముందున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి ఇప్పుడు మాజీలైన వారు కూడా తమ వారసుల్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వీరికి ఆయా పార్టీల అధినేతలు ఇప్పుడు వీరికి టికెట్లు ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

వారసులకు నో చెప్పేసిన జగన్

వారసులకు నో చెప్పేసిన జగన్

వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురు సీనియర్లు ఈసారి తమ వారసుల్ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వీరిని ప్రచారంలో కూడా తిప్పేస్తున్న వీరు.. సరైన సమయంలో జగన్ ను కలిసి టికెట్లు డిమాండ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి వారిలో సామినేని ఉదయభాను, భూమన, బుగ్గన, పేర్నినాని, ముస్తఫా, బాలినేని, సుచరిత, శిల్పా చక్రపాణి రెడ్డి, కొడాలి నాని వంటి వారు ఉన్నారు. అయితే వీరి ఆశలపై జగన్ తాజాగా నీళ్లు చల్లారు. వారసులకు టికెట్లు ఇవ్వబోమని తేల్చిచెప్పేశారు. దీంతో వీరంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. జగన్ నిర్ణయం వీరందరికీ మింగుడు పడటం లేదు.

వారసులకు సై అంటున్న చంద్రబాబు

వారసులకు సై అంటున్న చంద్రబాబు


మరోవైపు జగన్ కు భిన్నంగా టీడీపీలో వారసులకు టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సై అంటున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసి వారు, సీనియర్లు తమ వారసుల్ని రంగంలోకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు మద్దతిస్తున్నారు. మాజీ మంత్రులు జవహర్, కిమిడి మృణాళిని, పరిటాల సునీత, ఎంపీ కేశినేని నానితో పాటు రాష్ట్రంలో పలువురు సీనియర్ల వారసులకు టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తనయుడు నారా లోకేష్ తో కలిసి తిరుగుతున్న వీరంతా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఖాయమనే ధీమాలో ఉన్నారు. ఇప్పటికే వీరంతా జనంలో కలిసి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేసుకుంటున్నారు.

2024లో పడే ప్రభావమెంత ?

2024లో పడే ప్రభావమెంత ?


2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ తరఫున బరిలోకి దిగే వారిలో యువత ఎక్కువ శాతం ఉంటుందని ఇప్పటికే అంచనాలున్నాయి. ఈ అంచనాలతోనే ఇరుపార్టీల్లోనూ యువ నాయకులకు ప్రోత్సాహం కూడా లభించింది. కానీ ఇప్పుడు సడన్ గా జగన్ వారసులకు టికెట్లు లేవని చెప్పేయడంతో వైసీపీలో మాజీ మంత్రులు, ఇతర సీనియర్లు తమ వారసుల్ని ఇతర పార్టీల్లోకి పంపి పోటీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అదే టీడీపీలో అయితే అక్కడే టికెట్లు లభించే అవకాశం ఉండటంతో ఆయా నేతలు తమ వారసుల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పరిస్దితి లేదు. ఈ పరిణామాలు కచ్చితంగా 2024 ఎన్నికల్లో కనీసం 40 స్ధానాల్లో ప్రభావం చూపుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి.

English summary
ap cm ys jagan and opposition leader chandrababu are drawing two different plans on tickets to successors for 2024 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X