అక్కడే రాజీ పడుతున్నా: విశాఖ 'ఆందోళన'లో కుట్ర కోణం చూస్తున్న బాబు

విశాఖ ఆర్కే బీచ్‌లో నిరసనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత వైయస్ జగన్ మద్దతు పలకడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.

విజయవాడ: విశాఖ ఆర్కే బీచ్‌లో నిరసనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత వైయస్ జగన్ మద్దతు పలకడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.

జల్లికట్టుకు, హోదాకు సంబంధమేంటి?

జల్లికట్టుకు, హోదాకు సంబంధమేంటి?

జల్లికట్టు తరహా ఉద్యమిద్దామని పవన్, జగన్, కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. జల్లికట్టుకు, హోదాకు ఏం సంబంధమని నిలదీసారు.

ఉద్దేశ్యపూర్వకంగా విశాఖలో ఆందోళనలు

విశాఖలో రెండోసారి ఇన్వెస్టుమెంట్ మీట్ జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్దేశ్య పూర్వకంగానే కొందరు విశాఖలో ఆందోళనలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

సుస్థిరత లేదని చెప్పేందుకే

సుస్థిరత లేదని చెప్పేందుకే

విశాఖలో సమ్మిట్ జరుగుతుంటే గొడవలు సృష్టించడం ద్వారా వస్తున్న 42 దేశాల ప్రతినిధులలో భయాందోళనలు సృష్టించడమే వారి ఉద్దేశ్యమా అని ప్రశ్నించారు. గొడవలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో సుస్థిరత లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

బెదిరించినందుకే గత ఎన్నికల్లో అందుకే ఓడారు

బెదిరించినందుకే గత ఎన్నికల్లో అందుకే ఓడారు

విశాఖలో గతంలో భయాందోళనలు సృష్టించినందు వల్లే అక్కడ ఎంపీగా బీజేపీ నేత హరిబాబు గెలిచారని చెప్పారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి హరిబాబు పైన వైయస్ విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు. ఈ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

ఎక్కడ రాజీపడుతున్నానంటే...

ఎక్కడ రాజీపడుతున్నానంటే...

తాను కేంద్రంతో రాజీ పడుతున్నానని పదేపదే విపక్షాలు చెప్పడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి కేంద్రం సహకారం అవసరమని చెప్పారు. నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇక్కడే తాను రాజీ పడుతున్నానని చెప్పారు.

హోదా చట్టంలో లేదు

ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదని చంద్రబాబు చెప్పారు. అది పార్లమెంటులో ఇచ్చిన హామీ అన్నారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటనే తాము అంగీకరించామని చెప్పారు. హోదా విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించవద్దన్నారు. హోదా వస్తే 100 శాతం రాయితీలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్యాకేజీ ఇచ్చి, చట్టబద్ధత కల్పించాలని తాను మోడీని, జైట్లీని కోరానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+