Chandrababu: జగన్ మెడకు ఉరేసే అవకాశమొచ్చింది.. ఆపై మీ జీవితాలు అన్‌స్టాపబుల్‌

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. వైయస్ జగన్ పైన చంద్రబాబు, చంద్రబాబు పైన వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ పొలిటికల్ హీట్ ను మరింత పెంచేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు ప్రజా గళం సభలో మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఫ్యాన్ ను చిత్తుచిత్తుగా చితగ్గొట్టి చెత్తబుట్టలో పడేయండి
ఇప్పుడు జగన్ మెడకు ఉరి వేసే అవకాశం వచ్చిందని, మే 13వ తేదీన ఫ్యానుకు, వైసిపికి ఉరెయ్యాలని సైకిల్ కు పట్టం కట్టాలని అక్కడ నుండి మీ జీవితాలు అన్ స్టాపబుల్ అని, ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తానంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మీకు అండగా నేనుంటా అని పేర్కొన్న చంద్రబాబు మే 13 నా ఫ్యాన్ ను చిత్తుచిత్తుగా చితగ్గొట్టి చెత్తబుట్టలో పడేయమన్నారు.

Chandrababu sensation you have a chance to hang Jagan then your lives are unstoppable

జగన్ ను తిట్టిపోసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతియుగం పోయి మళ్ళీ స్వర్ణయుగం రావాలని ఇది జరగాలంటే టిడిపిని గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి అని కానీ చేతలు గడప కూడా దాటడం లేదని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఒక మోసకారి, అహంకారి, సైకో, విధ్వంస కారుడు, బందిపోటు దొంగ, అతను ఒక నియంత అంటూ తనదైన శైలిలో తిట్టిపోశారు చంద్రబాబు.

హలో ఏపీ.. బై బై జగన్ అంటారు పవన్ కళ్యాణ్
డబ్బంతా తనదగ్గరే ఉండాలని ఈ నియంత ఆలోచిస్తాడని, ఎంగిలి మెతుకులతో జనాలు బ్రతకాలని చూస్తాడని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకమాట చెబుతాడని పేర్కొన్న చంద్రబాబు హలో ఏపీ.. బై బై జగన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాము అధికారంలోకి వస్తే తొలిసంతకం మెగా డీఎస్సీపై, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుపై పెడతామని చంద్రబాబు అన్నారు.

క్లాస్ వార్ కాది క్యాష్ వార్ ఇది
మా భూమిని మీ అధీనంలో ఉంచుకోవడం ద్వారా మా మెడకు ఉరితాడు వేసి ఆ తాడు నీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు అని అందుకే ఈ నల్ల చట్టాన్ని చించి చెత్తబుట్టలో పడేస్తాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదవాళ్ల ను సర్వనాశనం చేసిన జగన్ పేదవాళ్ల పక్షమని మాట్లాడుతున్నాడని, మాట్లాడితే క్లాస్ వారని చెబుతున్నారని.. ఇది క్లాస్ వారు కాదు క్యాష్ వార్ అంటూ పేర్కొన్నారు.

రాష్ట్రంలో డబ్బంతా తాడేపల్లి కొంపకి .. సిగ్గుండాలి జగన్
రాష్ట్రంలోని డబ్బు అంతా తాడేపల్లి కొంపకి పోయిందని.. ఆ డబ్బంతా మీది అన్నారు. వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న జగన్ పేదల పక్షం అని చెప్పడానికి, పేదల ప్రతినిధి అని చెప్పడానికి సిగ్గు ఉండాలని చంద్రబాబు విమర్శించారు. తమ హయాంలో అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని ముందుకు వెళితే, ఈ దుర్మార్గుడు వచ్చి అమరావతిని సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే అమరావతికి పూర్వవైభవం తీసుకొస్తామని, తద్వారా రాష్ట్రంలో అనేక ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+