మారాలనుకుంటున్న చంద్రబాబు, బాలకృష్ణ సూచన!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇల్లు మారుతున్న విషయం తెలిసిందే. అయితే, దీని వెనుక హీరో, హిందూపురం టీడీపీ శాసన సభ్యుడు బాలకృష్ణ సూచన ఉండి ఉండవచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ వాస్తు, జ్యోతిష్యాలను బాగా నమ్ముతారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన దగ్గరుండి మరీ కొన్ని వాస్తు పరమైన మార్పులు చేయించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గడంతో బాలయ్య వాస్తు సెంటిమెంటుకు విశ్వసనీయత చేకూరింది.

తాజాగా, చంద్రబాబు ఇల్లు మారాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇంటిలో మూడు గదులే ఉండటంతో ఇరుకుగా ఉంది. ఇల్లు మారేందుకు వాస్తు కూడా ఓ కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ సూచన మేరకు బాబు పాత ఇంటి స్థానంలో కొత్తగా ఆధునిక హంగులతో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు, ఈ ఇంటి నిర్మాణ పనులను బాలకృష్ణనే పర్యవేక్షించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications