చేయడానికి బాబు వద్ద ఏం లేదు, నిజమయ్యేలా: బొత్స

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద ఏమీ లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ బుధవారం అన్నారు. హామీల నుండి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల పైన తాము ప్రజల తరఫున పోరాడుతామని చెప్పారు. ఇచ్చిన హామీలను అన్నింటిని చంద్రబాబు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తీరు చూస్తుంటే వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు మాటలు నిజమయ్యేలా ఉన్నాయని అన్నారు.

Chandrababu should fulfill his promises: Botsa

భారతీయ జనతా పార్టీ అడ్డుకొని ఉంటే కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజన చేయగలిగేదా అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయక పోవడంతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు.

అలకవీడని మాజీ మంత్రి బండారు

మంత్రి పదవి దక్కకపోవడంతో మనస్తాపంతో ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంకా అలకవీడలేదు. బండారు ఇంటికి వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాస రావు వెళ్లి బుజ్జగించారు. మంత్రి పదవిరాకపోవడంపై మనస్తాపంతో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి, శ్రీకాకుళం-విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+