సంబరం తాత్కాలికమే: జానా రెడ్డి, సచివాలయం ఉద్రిక్తం

ఢిల్లీ పెత్తనమా: బాబు
అసెంబ్లీ పైన ఢిల్లీ పెత్తనమేమిటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి కాంగ్రెసు పార్టీ పైన శుక్రవారం నిప్పులు చెరిగారు. అసెంబ్లీ పైన ఎమ్మెల్యేలకే హక్కు ఉంటుంద్నారు. ఇష్టం వచ్చినట్లుగా చేయడం కుదరదన్నారు. గతంలో రాంలాల్ విషయంలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
సచివాలయంలో ఉద్రిక్తత
తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగాలు పోటా పోటీగా నినాదాలు చేశారు. ఆందోళనలకు దిగారు.
బిల్లును నిరసిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నాలు చేశారు. దానిని పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీఎఫ్ పోలీసులు ఉద్యోగులు సి బ్లాక్ వరకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీమాంధ్ర ఉద్యోగులు, ఎస్పీఎఫ్ మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ ఉద్యోగులు సైతం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.












Click it and Unblock the Notifications