ఆస్తులు లాక్కున్నా మారలేదు, రెచ్చగొడ్తున్నారు: జగన్‌పై చంద్రబాబు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష ేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష ేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు మండిపడ్డారు. ఆస్తులను ఈడీ జఫ్తు చేసినా జగన్ తీరు మారలేదని విమర్శించారు.
ప్రజల సంక్షేమం కోసం తాము చేపడుతున్న ప్రతి పనికి అడ్డుపడుతున్నారన్నారు. ఆస్తులను ఈడీ జప్థు చేసినా ఆయనలో మార్పు రాకపోవడం విడ్డూరమన్నారు. జగన్ చేస్తున్న విష ప్రచారాలను పార్టీ నేతలు తిప్పికొట్టాలన్నారు.

భోగాపురం, బందర్ పోర్టు, ఫుడ్ పార్కులు వద్దని ఆందోళనలు చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫార్మా ఇండస్ట్రీ పెడితే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. జగన్ అక్కడకు వెళ్లి యువతను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రతి పనికి అడ్డు తగులుతూ, ఏపీలో పరిశ్రమలు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications