వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబు పేల్చిన జగన్ సర్కార్.. అమరావతి భూకొనుగోళ్లపై సంచలన రిపోర్టు.. బాబు, లోకేశ్

|
Google Oneindia TeluguNews

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగాయని వాదిస్తోన్న జగన్ సర్కారు.. దీనికి సంబంధించిన సంచలన ఆధారాలను బయటపెట్టింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన నివేదిక వెల్లడికావడం రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది. రాజధానిని అమరావతిలో కొనసాగించాలని పట్టుపడుతోన్న టీడీపీ నేతల పేర్లన్నీ ఈ నివేదికలో ఉండటం చర్చనీయాంశమైంది.

రిపోర్టులో ఏముందంటే..

రిపోర్టులో ఏముందంటే..

శుక్రవారం వెలుగులోకి వచ్చిన మంత్రుల కమిటీ రిపోర్టు ప్రకారం.. అమరావతి చుట్టుపక్కల టీడీపీ నేతలు.. బినామీ పేర్లతో పెద్ద ఎత్తున భూములు కొన్నారు. నాలుగువేల పైచిలుకు ఎకరాలు(మొత్తం 4,069.94 ఎకరాల) భూముల కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలను రిపోర్టులో పొందుపర్చారు. ఈ లావాదేవీలన్నీ 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ మధ్య చోటుచేసుకున్నట్లు తెలిపారు.

ఎవరెవరికి ఎంత భూమి?

ఎవరెవరికి ఎంత భూమి?

= బినామీల పేరుతో నారా లోకేశ్ కు 62.77 ఎకరాలు
బినామీలు వేమూరి రవికుమార్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోష్పాదీ గ్రీన్ ఫీల్డ్, ఫ్యూచర్ ట్రెండ్స్ కన్ స్ట్రక్షన్ పేరుతో భూములు
= లింగమనేని రమేశ్: భార్య ఎల్.సుమన, బంధువులు ప్రశాంతి, స్వర్ణకుమారి రమేశ్, రాజశేఖర్ పేర్లమీద భూములు కొన్నారు. అభినందన్ హౌసింగ్ అనే మరో బినామీ సంస్థకూ భూములు
= మాజీ ఎమ్మెల్యే తుమ్మలపాటి శ్రీధర్ కు 68.6 ఎకరాలు
= బినామీ గుమ్మడి సురేశ్ పేరుతో ప్రత్తిపాటి పుల్లారావుకు 38.84 ఎకరాలు
= మైత్రి ఇన్ ఫ్రా పేరుతో రావెల కిషోర్ బాబు బినామీలకు 40.85 ఎకరాలు
= శశి ఇన్ ఫ్రా పేరుతో మాజీ స్పీకర్ కోడెల బినామీలకు 17.13 ఎకరాలు
= మురళీమొహన్, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, పల్లె రఘునాథరెడ్డి, గోరట్ల బుచ్చయ్య చౌదరిలకు కూడా భూములున్నట్లు నివేదికలో వెల్లడి.

ఇప్పుడేం జరుగుతుంది?

ఇప్పుడేం జరుగుతుంది?

గత ప్రభుత్వ హాయంలో అవినీతి జరిగిదంటూ వచ్చిన ఆరోపణల పైన ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ.. శుక్రవారంనాటి కేబినెట్ మీటింగ్ లోనే తమ రిపోర్టును సీఎం జగన్ కు అందజేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమేరకు అవసరమనుకుంటే సీబీఐతోనూ ఎంక్వైరీ చేయించాలని కమిటీ సిఫార్సు చేసింది. మంత్రుల రిపోర్టులో వెలుగుచూసిన అక్రమాలపై న్యాయసలహా తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఒకటిరెండురోజుల్లోనే దీనిపై క్లారిటీ వస్తుంది.

English summary
The sub-committee report stated that a company owned by family members of TDP chief and former Chief Minister Chandrababu Naidu was involved in the purchase of land in July 2014
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X