Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెట్ల కింద: బాబు, టిపై, చేతి గాజులు తీసిచ్చిన మహిళ

హైదరాబాద్: ఈ రోజు మనమంతా చెట్ల కింద ఉన్నామని అందరికీ తెలుసునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఎపి సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు సచివాలయానికి వచ్చారు. ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

ఇవాళ మనం చెట్ల కింద ఉన్నామని అందరికీ తెలుసునని చెప్పారు. ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. టిడిపి పాలనలో హైదరాబాదుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్ వచ్చాకే తెలుగువాళ్ల ఆత్మగౌరవం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. టిడిపి పాలన వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉందని చెప్పారు. ఉద్యోగుల విభజన జనాభా ప్రకారం చేశారన్నారు.

 Chandrababu speech in Secretariat

తెలుగు జాతి మొత్తం ఒక్కటేనని, కొందరు ఓట్లు, సీట్ల కోసం తెలుగు జాతిని ముక్కలు చేశారన్నారు. తెలంగాణలోని వారు కూడా మనకు అన్నదమ్ములేనని చెప్పారు. తెలుగు జాతి అంతా ఒక్కటే అన్నారు. కొందరు విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలోని తెలుగు వాళ్లు కూడా మన అన్నదమ్ములే అన్నారు.

యూపిఏ హేతుబద్దంగా విభజన చేయలేదన్నారు. రెండు రాష్ట్రాలకు సమాన స్థితి వచ్చేలా మోడీ ప్రభుత్వం చూడాలన్నారు. 1995లో తనకు ఉద్యోగులు సహకరించారని, ఇప్పుడు కూడా అలాగే సహకరించాలని కోరారు. ఉద్యోగులను ఒక్కసారిగా వెళ్లమంటే ఇబ్బందులు పడతారని తనకు తెలుసునని చెప్పారు.

తాను మీలో ఒకడినని ఉద్యోగులతో అన్నారు. అందరం కలిసి ఎపిని దేశంలోనే మంచిస్థానంలో నిలబెడతామన్నారు. తనకు ఉద్యోగుల సహకారం కావాలన్నారు. సంక్షోభంలోనే అవకాశం వెతుక్కోవడం తనకు అలవాటు అన్నారు. ఐదేళ్ల పాటు అందరం కష్టపడతామని, ఎపిని అభివృద్ధి చేద్దామన్నారు.

సిఎంగా ఉన్నప్పటికీ ఉద్యోగులు, నేను కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. తనను ముందుకు నడిపిస్తే అందరం అభివృద్ధి చెందుదామన్నారు. ఎపిలో అభివృద్ధి కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సముద్రంలోకి నీళ్లు వృథాగా వెళ్లిపోతున్నాయనే పోలవరం కట్టుకుంటున్నామని, దానిపై కొందరు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాజధాని నిర్మాణానికి రెండు రోజుల వేతనం

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎపి సచివాలయ ఉద్యోగులు రెండు రోజుల వేతనాన్ని ఇచ్చారు. చంద్రబాబు సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు సచివాలయ ఉద్యోగ సంఘం నేత మురళీ కృష్ణ మాట్లాడారు.

సచివాలయం తమకు ఇల్లు వంటిదని, ఎపి ముఖ్యమంత్రి తండ్రి వంటి వారన్నారు. ఎపి అభివృద్ధి కోసం తాము అదనంగా పని చేస్తామన్నారు. తెలంగాణకు కేటాయించబడిన ఎపి ఉద్యోగులను తిరిగి ఎపి సచివాలయానికి బదలీ చేయాలన్నారు. కాగా, ఓ ఆర్థిక శాఖ ఉద్యోగి చేతికి ఉన్న నాలుగు గాజులను చంద్రబాబుకు అందించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+