రాజధాని: 3 మెగాసిటీలు, ఏ జిల్లాకు ఏమిచ్చారు...?
హైదరాబాద్: విజయవాడ పరిసరాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం శాసన సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఏ జిల్లాలో వేటిని ఏర్పాటు చేయనున్నారనే విషయాన్ని అధికార పక్షం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐదు గ్రిడ్‌లు, ఏడు మిషన్లు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. విజయవాడ, తిరుపతి, విశాఖ నగరాలను మెగాసిటీలుగా చేయనున్నారు. విశాఖ, నెల్లూరుల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు.

ఏ జిల్లాల్లో ఏవి..
విశాఖ - పారిశ్రామికవాడ, ఐఐఎం, ఐటీ హబ్, రైల్వేజోన్, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్, ఫుడ్ పార్క్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, మెగా సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ హబ్, మెట్రో రైలు
తూర్పు గోదావరి - పెట్రోలియం కారిడార్, పోర్టు, హార్డ్‌వేర్ పార్క్, స్మార్ట్‌సిటిలుగా కాకినాడ, రాజమండ్రి, ఫుడ్ పార్క్, కొబ్బరి పీజు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్, పెట్రోలియం విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, పోర్టు, ఐటీ
విజయనగరం - స్మార్ట్ సిటి, పోర్టు, మెడికల్ కాలేజి, సంగీత లలిత కళల అకాడమీ, పారిశ్రామిక నగరం, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, పారిశ్రామిక నగరం, ఫుడ్ పార్క్, గిరిజన విశ్వవిద్యాలయం
పశ్చిమ గోదావరి - తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టు, ఆయిల్‌ఫామ్ పరిశ్రమ, జలమార్గాల అభివృద్ధి, హార్టికల్చర్ వర్సిటీ, చింతలపూడిలో బొగ్గు వెలికితీత, ఎన్ఐటీ, నర్సాపూర్ పోర్టు, సిరామిక్ పరిశ్రమ, పోలవరం
కృష్ణా - మచిలీపట్నం పోర్టు-ఆయిల్ రిఫైనరీ, మెట్రో రైలు, ఆటోమొబైల్ హబ్, మెగాసిటి, టెక్స్‌టైల్ పార్క్, కూచిపూడి అకాడమీ, అవనిగడ్డలో మిస్సైల్ పార్క్, గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం, ఫుడ్ పార్క్, ఐటీ, నూజివీడులో మామిడి రీసెర్చ్ సెంటర్
గుంటూరు - మెట్రో రైలు, స్మార్ట్‌సిటి, నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్టు, థీమ్‌పార్క్, సౌర విద్యుత్ కేంద్రం, టెక్స్‌టైల్ పార్క్, విమానాశ్రయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, ఎన్డీఎమ్ఏ.
ప్రకాశం - స్మార్ట్‌సిటి, ఫుడ్‌పార్క్, కనిగిరిలో పెట్టుబడులు-ఉత్పత్తి జోన్, ఏడాదిలో వెలిగొండ మొదటి దశ పూర్తి. పారిశ్రామిక నగరంగా దొనకొండ, ఒంగోలులో విమానాశ్రయం, రామాయంపేటలో పోర్ట్, మైన్స్ వర్సిటీ,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు - విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, హోటల్ మేనేజ్‌మెంట్, మెరైన్ ఇనిస్టిట్యూట్‌లు, ఎరువుల కర్మాగారం, స్మార్ట్‌సిటి, ఆటో మొబైల్ హబ్, విమానాశ్రయం, దుగరాజుపట్నం పోర్టు
కర్నూలు - స్మార్ట్‌సిటీ, ఎయిర్‌పోర్టు, అవుకు దగ్గర పారిశ్రామిక నగరం, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్. కర్నూలులో ఐటీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, కోయిలకుంట్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్, స్విమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, టూరిజం సర్క్యూట్, సోలార్- విండ్ పవర్, లైవ్ స్టాక్ రీసెర్చ్, పాలిటెక్నిక్ సెంటర్, ఫుడ్ పార్క్, రైల్వేవ్యాగన్లు మరమ్మతుల కేంద్రం, నంద్యాలలో విత్తనోత్పత్తి కేంద్రం, మైనింగ్ స్కూల్.
చిత్తూరు - కుప్పంలో ఎయిర్‌పోర్టు, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఐఐటీ, ఐటీ హబ్, మెట్రో రైలు ఐఐఎస్‌ఈఆర్, హార్టికల్చర్ జోన్, ఆధ్యాత్మిక-పర్యాటక సర్క్యూట్ జోన్.
కడప - ఐటీ పరిశ్రమ, పారిశ్రామిక స్మార్ట్‌సిటి, గార్మెంట్ క్లస్టర్, సోలార్, విండ్ పవర్, స్టీల్ ప్లాంట్, సిమెంట్ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, ఉర్దూ విశ్వవిద్యాలయం
అనంతపురం - ఉద్యానవన కేంద్రం, స్మార్ట్‌సిటీ, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ వర్సిటీ, టెక్స్‌టైల్ పార్క్ ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, పెనుకొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, జిల్లాలో 100 శాతం డ్రిప్, బింధు సేద్యం బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో హిందూపురం, పుట్టపర్తిలో విమానాల మరమ్మతుల కేంద్రం, ఏడాదిలో హంద్రినీవా ప్రాజెక్టు తొలి దశ పూర్తి, ఫుడ్ పార్క్, పుట్టపర్తిని స్పిరిచ్యువల్ కేంద్రంగా
శ్రీకాకుళం - భావనపాడు, కళింగపట్నం పోర్టులు, ఎయిర్‌పోర్టు, స్మార్ట్‌సిటీ, నూతన పారిశ్రామిక నగరం, ఆర్కిటెక్చర్ స్కూల్, పైడిభీమవరం పారిశ్రామికవాడ, ఓపెన్‌యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ పార్క్, వంశధార, నాగావళిపై ప్రాజెక్టుల పూర్తి, బారువ బీచ్.












Click it and Unblock the Notifications