తమ్ముడూ! నేను చెప్పేది విను: జగన్ పార్టీ ఎమ్మెల్యేకి బాబు షాక్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యేకి షాకిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఆయడ్ని అడ్డుకున్నారు.
కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యేకి షాకిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఆయడ్ని అడ్డుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా చోటు చేసుకుంది. సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐజయ్య పాల్గొన్నారు.
అయితే, చంద్రబాబు.. స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ భాగస్వామ్యం లేదని, పట్టిసీమ ప్రాజెక్ట్ ను వైయస్సార్ కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. అయితే ఇక్కడ తాను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదని, ప్రజలకు వాస్తవాలు వివరించడానికి వచ్చానని ఎమ్మెల్యే చెప్పారు. కేవలం అభినందలు మాత్రమే చెప్పాలంటూ ఎమ్మెల్యేకు... చంద్రబాబు సూచించారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే ఐజయ్య ప్రాజెక్ట్ కోసం పునాది వేసింది వైయస్ అన్నారు. అంతేగాక, పోలవరం ప్రాజెక్ట్ కు పునాది వేసింది కూడా వైయస్సేనని చెప్పారు. దీంతో ఆ ఎమ్మెల్యే ప్రసంగిస్తున్న సమయంలో మధ్యలో చంద్రబాబు అడ్డుకున్నారు.
అయినా వినకుండా ఐజయ్య ప్రసంగించారు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే మైక్‌ను కట్ చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఒకింత అసహనానికి గురయ్యారు. 'తమ్ముడూ! విను.. నేను చెప్పింది విను... అరే వినవయ్యా.. నేను చెప్పేది విను' అంటూ ఆ ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. పునాదులు వేసిన వాళ్లు కాదు.. పునాదులు వేసి వెళ్లిపోయినవాళ్లు చాలామంది ఉన్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications