బాబు వ్యూహం: ఎన్టీఆర్ ఫ్యామిలీ చిందరవందర
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహానికి స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు కకావికలమయ్యారు. ఓ పార్టీకీ ఓ సీటుకూ కాకుండా పోయారు. ఇతర పార్టీల్లో మనుగడ సాగిద్దామనే ప్రయత్నాలకు కూడా విఘాతం ఏర్పడింది. విశాఖపట్నం లోకసభ సీటును ఆశించి బిజెపిలో చేరిన దగ్గుబాటి పురంధేశ్వరి కడప జిల్లాలోని రాజంపేట లోకసభ స్థానంలో పోటీ చేయాల్సి వస్తోంది. రాజంపేట సీటులో విజయం సాధించడం ఆమెకు ఆషామాషీ ఏమీ కాదు.
విభజనపై వ్యతిరేకతతో కాంగ్రెసును వీడిన దగ్గుబాటి దంపతులు ఇప్పుడు రాజకీయాల్లో గడ్డు సమస్యను ఎదుర్కుంటున్నారు. తెలుగుదేశంతో బిజెపి పొత్తు పెట్టుకోవడంతో భార్య పురంధేశ్వరి విజయం ఖాయం కాని సీటుకు మారాల్సి వస్తే దగ్గుబాటి వెంకటేశ్వర రావు పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఆయన బిజెపిలో కూడా చేరలేదు. కాంగ్రెసుకు రాజీనామా చేసినప్పుడే తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పారు.

కాగా, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ పరిస్థితి ఎటూ కాకుండా పోయేట్లుంది. బిజెపిలో చేరుదామని అనుకున్నా తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా అక్కడ తగిన స్థానం లభించే అవకాశం లేదు. హిందూపురం నుంచి పోటీ చేయడానికి ఉబలాటపడిన హరికృష్ణ ఆ సీటును తన సోదరుడు బాలకృష్ణకు కేటాయించడంతో కృష్ణా జిల్లాలోని ఏదైనా సీటు నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.
కృష్ణా జిల్లాలోని పెనమలూరు లేదా నూజివీడు శాసనసభా స్థానాల నుంచి పోటీ చేయాలని భావించారు. చివరి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయనను ఆశపెట్టారు. కానీ చివరి నిమిషంలో హరికృష్ణకు చేయి ఇచ్చారు. దీంతో హరికృష్ణ తీవ్ర నిరాశకు గురయ్యారు. దానికితోడు, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం పెట్టారు.
ఓవైపు, తనకు నచ్చని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరు అయితే, మరోవైపు తనతో పాటు నడుస్తున్న తన వియ్యంకుడు, ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణకు హిందూపురం శాసనసభా టికెట్ ఇచ్చారు. అది కూడా చంద్రబాబుతో తీవ్రంగా అంతర్గత పోరాటం చేసి బాలయ్య ఆ సీటును దక్కించుకున్నట్లు చెబుతున్నారు.
తన కుమారుడు నారా లోకేష్‌ను చంద్రబాబు నాయుడు ఎన్నికల బరిలోకి దింపలేదు. కానీ, ఆయనకు తన వారసత్వాన్ని అందించడానికి మాత్రం సన్నద్ధమైనట్లు అర్థమవుతోంది. నారా లోకేష్ ఇప్పుడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి స్టార్ కాంపైనర్ అయ్యారు. సీమాంధ్రలో టిడిపి గెలిస్తే నారా లోకేష్ క్రిడెట్ కొట్టేసే అవకాశాలున్నాయి. రాజకీయ చాతుర్యంలో దిట్ట అయిన చంద్రబాబును ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications