ఏపీలో గ్రామ సచివాలయాల్ని అలా వాడుకోండి.. ! చంద్రబాబు కీలక సూచన..!
ఏపీలో గ్రామ సచివాలయాలపై ఇవాళ సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్ధలో కీలక మార్పులు చేస్తున్న కూటమి సర్కార్ వాటిని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలని అధికారులకు సూచించారు. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహించిన డేటా డ్రివెన్ సదస్సులో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక సూచన చేశారు. దీంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్స్ గా వాడుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇవాళ జరిగిన సమావేశంలో తెలిపారు. గ్రామ సచివాలయాలను ఇకపై విజన్ యూనిట్స్ గా వాడుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సమర్థంగా ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా వీటిని రూపొందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందుకు అధికారులు ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్ధతో పాటు వాలంటీర్ల వ్యవస్ధను కూడా తీసుకొొచ్చింది. ఐదేళ్ల పాటు విజయవంతంగా సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందించడం, సర్వేల నిర్వహణతో పాటు పలు అంశాల్లో ఇవి ప్రజలకు ఉపయోగపడ్డాయి. అయితే జగన్ తెచ్చిన వాలంటీర్ల వ్యవస్ధ వైసీపీకి అనుకూలంగా మారడంతో అప్పట్లో విపక్షంలో ఉన్న కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ దీనిపై తీవ్ర విమర్శలు చేసేవి. సచివాలయ వ్యవస్ధ విషయంలో మాత్రం అంతగా విమర్శలు రాలేదు.
కానీ గత ఎన్నికల్లో కూటమి సర్కార్ విజయం తర్వాత వాలంటీర్లను పక్కనబెట్టి చంద్రబాబు సచివాలయాల ఉద్యోగులతోనే వారి విధులు కూడా చేయిస్తున్నారు. సచివాలయాల వ్యవస్ధను పూర్తిస్ధాయిలో ప్రక్షాళన చేయడంతో పాటు వాటి విధుల్లోనూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజన్ కు అనుగుణంగా వీటిని మార్చే క్రమంలో వీటిని ఇక నుంచి విజన్ యూనిట్స్ గా వాడుకోవాలని ఇవాళ అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications