ధర్మాబాద్ కోర్టుకు వెళ్లాలా? వద్దా?: చంద్రబాబు కీలక చర్చ, చివరకు ‘రీకాల్’కే ఓటు!
అమరావతి: బాబ్లీ కేసు విషయంలో నోటీసులు రావడంతో ధర్మాబాద్ కోర్టుకు స్వయంగా హాజరు కావాలా? వద్దా అనేదానిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో కీలక చర్చలు నిర్వహించారు. అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులు, ముఖ్యనేతలు, అడ్వకేట్ జనరల్‌తో తన నివాస ప్రాంగణంలోని ప్రజా వేదికలో సమావేశమయ్యారు.

కోర్టుకు హాజరు కావాలా? వద్దా?
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ దాడులు, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల తదితర అంశాలపైనా చర్చించారు. ముఖ్యంగా బాబ్లీ పోరాటంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పై హాజరు కావాలా? వద్దా? అనే అంశంపైనే ఈ భేటీలో కీలక చర్చ జరిగింది.

భారీ ర్యాలీగా వెళితే...
ధర్మబాద్ కోర్టుకు భారీ ర్యాలీతో హజరైతే బాగుంటుందని చంద్రబాబుకి ఇప్పటికే కొందరు మంత్రులు సూచించారు. అయితే, కోర్టుకు వెళ్లకుండా రీకాల్ పిటిషన్ వేయాలని మరికొందరు మంత్రులు కోరారు. చిన్న కేసులకు సీఎం స్థాయి వ్యక్తి ఎందుకు హాజరుకావాలని సీనియర్ మంత్రులు అభిప్రాయపడ్డారు.

రీకాల్ పిటిషన్‌కే బాబు మొగ్గు
ఈ సమావేశంలో అందరి సూచనలు పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు.. కోర్టుకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. రీకాల్ పిటిషన్ వేసేందుకే ఆయన మొగ్గు చూపినట్లు తెలిసింది. సీఎంతో సమావేశమైన వారిలో మంత్రులు కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, నారాయణ, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, అమర్నాథ్ రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులున్నారు.

సీఎం అయినా రావాల్సిందేనన్న కోర్టు
కాగా, బాబ్లీ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు సహా 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ నెలలో చంద్రబాబు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ హాజరై కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో సీఎం అయినా, మరెవరైనా కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications