అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు! జగన్ నోరు మెదపడు, పవన్ పత్తాలేడు: కేంద్రంపై బాబు ఫైర్

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అపోహలు పెంచాలని మోడీ చూశారని దుయ్యబట్టారు.

ధరలు తగ్గినా ప్రయోజనంలేదు, ఆపరేషన్ గరుడపై సాక్ష్యాలు: జగన్‌ను లాగి బాబు షాకింగ్ ధరలు తగ్గినా ప్రయోజనంలేదు, ఆపరేషన్ గరుడపై సాక్ష్యాలు: జగన్‌ను లాగి బాబు షాకింగ్

టీడీపీని ఒంటరి చేయాలనే..

టీడీపీని ఒంటరి చేయాలనే..

రాజకీయంగా టీడీపీని ఒంటరిని చేయాలని చూస్తున్నారని, రాష్ట్రంలో పార్టీని బలహీనపరచాలని కుట్రలు పన్నుతున్నారని తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ వ్యూహ కమిటి సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో సమర్ధ నాయకత్వం లేకుండా చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

మంత్రినే హత్య చేస్తామంటారా?: జగన్ పార్టీ నేత వసంతకు బాబు హెచ్చరిక, ఆడియో టేప్, కేసుమంత్రినే హత్య చేస్తామంటారా?: జగన్ పార్టీ నేత వసంతకు బాబు హెచ్చరిక, ఆడియో టేప్, కేసు

Recommended Video

ఏపీ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త
జగన్ పార్టీతో కలిసి.. పవన్ పత్తాలేరు..

జగన్ పార్టీతో కలిసి.. పవన్ పత్తాలేరు..

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని కేంద్రం ఎందుకు పూడ్చడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి సహాయం చేయకపోగా అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలే ముందు' అనేది తెలుగుదేశం పార్టీ నినాదమని చెప్పారు. అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్‌తో అంటకాగుతోందని మండిపడ్డారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని కోరినవాళ్లే లోక్‌సభకు గైర్హాజరు అయ్యారని... ఢిల్లీకి వస్తామని చెప్పినవాళ్లు పత్తాలేకుండా పోయారని వైసీపీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

జగన్ నోరుమెదపడం లేదు

జగన్ నోరుమెదపడం లేదు

కేంద్రం వైఫల్యాలపై జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ నోరు తెరవడం లేదని మండిపడ్డారు. కేంద్రం ప్రజా వ్యతిరేక చర్యల వల్లే ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిందని స్పష్టం చేశారు. అందువల్లే కర్ణాటకలో బీజీపీయేతర పార్టీలకు తెలుగుదేశం మద్దతు ఇచ్చిందని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసిందని ఆరోపించారు.

అభినందిస్తున్నారు..

అభినందిస్తున్నారు..

ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించామని స్పష్టం చేశారు. వేల కోట్ల ఆర్ధిక లోటులో ఉండి కూడా పెట్రో ధరల తగ్గించడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. లీటరుకు 2 రూపాయల తగ్గింపు పేదలకెంతో ఊరట నిచ్చిందని.. ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ ప్రతినిధుల అభినందనలే దీనికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. పెట్రో ధరలు తగ్గించేందుకు కేంద్రం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu takes on at Centre and YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X