రూటు మార్చిన చంద్రబాబు, టార్గెట్ 2024 - కీలక నిర్ణయాలతో...!!
ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం గతం కంటే భిన్నంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. మహానాడు వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించటానికి సిద్దం అవుతున్నారు. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దసరా నాడు పవన్ తో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు కసరత్తు ప్రారంభమైంది. యువతకు ఇచ్చే సీట్ల పైన మహానాడులో క్లారిటీ ఇవ్వనున్నారు. పార్టీలో చేరికలకు మహానాడు వేదిక కానుంది.
మహానాడుకు సర్వం సిద్దం:టీడీపీ పండుగ మహానాడుకు సర్వం సిద్దం అవుతోంది. ఎన్నికల ముందు నిర్వహిస్తున్న మహానాడు కావటంతో ఈ సారి ప్రత్యేక ప్రాధాన్యత దక్కనుంది. ఎన్టీఆర్ శతజయంతి..మహానాడు కలిసి ఎన్నికలకు పార్టీని సిద్దం చేసేందుకు జోష్ పెంచేలా నిర్ణయాల పైన కసరత్తు చేస్తున్నారు. గతంలో ఎన్నికల ముందు వరకు మేనిఫెస్టో..అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు తాత్సారం చేసేవారు. కానీ, ఈ సారి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహానాడు వేదికగానే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సూచన ప్రాయంగా ప్రకటించాలని నిర్ణయించారు. దీని ద్వారా జగన్ తరువాత ప్రకటించే నిర్ణయాలు తమవేనని చెప్పుకొనే ఆలోచన చేస్తున్నారు. సీఎం జగన్ సంక్షేమం..సామాజిక న్యాయంకు ధీటుగా మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు.

పొత్తుల పైన ప్రకటన:ఈ నెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా టీడీపీ మహానాడు..ఎన్టీఆర్ శతజయంతి వేడకలు జరగనున్నాయి. 55 ఎకరాల్లో మహానాడు నిర్వహిస్తున్నారు. 27వ తేదీన 15 వేల మందితో ప్రతినిధుల సభ జరగనుంది. 28వ తేదీన సాయంత్రం 15 లక్షల మందితో ఎన్టీఆర్ శత జయంతి సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ సభ ద్వారా 2024 ఎన్నికల పైన కీలక ప్రకటనలు చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాధాన్యత అంశఆలను సూచన ప్రాయం గా ప్రకటించనున్నారు. ఈ సభలోనే పార్టీలో ముఖ్య నేతల చేరికలు ఉంటాయని సమాచారం. ఇదే సభ నంచి పొత్తులపైన చంద్రబాబు ప్రకటన చేస్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే పొత్తులపైన ఇచ్చిన సంకేతాలకు చంద్రబాబు తన ప్రసంగంలో ఒక స్పష్టత ఇవ్వనున్నారు.
మేనిఫెస్టో పై క్లారిటీ:ప్రధానంగా సంక్షేమ పథకాల లబ్ది దారుల పైనే వైసీపీ గెలుపు ఆశలు పెట్టుకుంది. ఈ సమయంలో సంక్షేమం పైన చంద్రబాబు ప్రకటన పై ఆసక్తి నెలకొంది. పూర్తి స్థాయి మేనిఫెస్టో కాకపోయినా.. ప్రధాన అంశాల పైన తమ విజన్ స్పష్టం చేయనున్నారు. ఇక నుంచి ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ ఖరారు చేయనున్నారు. వచ్చే విజయదశమి నాడు కలిసి పోటీ చేసే పార్టీలతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ కలిసి వస్తే మూడు పార్టీలు, లేకుంటే పవన్ తో కలిసి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అదే సమయంలో ఎన్నికలకు గతం కంటే భిన్నంగా ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించారు. ఎన్నికల ముందు జరుగుతున్న మహానాడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications