జగన్ తీవ్రవ్యాఖ్యలతో బాధ: ఒక్కదెబ్బకు 2 పిట్టలు, ఇద్దరికీ బాబు చెక్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క దెబ్బకు ఇటు వైసిపి అధినేత జగన్‌కు, అటు కాపు నేత ముద్రగడ పద్మనాభంకు చెక్ చెప్పబోతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. జ్యోతుల నెహ్రూను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ ఇద్దరు నేతలకు బాబు చెక్ చెబుతున్నారని అంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జ్యోతుల నెహ్రూ చాలా సీనియర్ నేత. ఆయన సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా టిడిపిలో చేరే అవకాశాలున్నాయి. నెహ్రూను చేర్చుకోవడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో వైసిపిని బాగా దెబ్బతీసేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది.

అదే సమయంలో, కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబుకు కాపు అంశం విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. ఓ సమయంలో తగ్గుతూ, మరో సమయంలో ఇరుకున పెడుతూ చంద్రబాబుతో ముద్రగడ ఆడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో మచ్చలేని, కాపులకు కీలక నేత అయిన జ్యోతుల నెహ్రూ ద్వారా ముద్రగడకు కూడా చెక్ చెప్పనున్నారని తెలుస్తోంది. కాపులకు టిడిపి ద్వారానే న్యాయం జరుగుతుందని, అందుకే జ్యోతుల సైకిల్ ఎక్కుతున్నారని కాపులకు చంద్రబాబు సంకేతం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

 Chandrababu targets Mudragada and YS Jagan with Nehru

కాగా, జగన్ తీరు పైన ఇటు టిడిపి, అటు వైసిపిని వీడుతున్న ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని కూలదోల్చుతామని, తనకు టిడిపిలో 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచే వైసిపి నుంచి టిడిపి వైపుకు వస్తున్నారని టిడిపి చెబుతోంది.

జ్యోతుల నెహ్రూ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో తన అనుచరులతో సమావేశమైన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. పీఏసీ చైర్మన్ పదవికి సరిపోని తాను, విపక్ష ఉపనేతగా సభలో ఎలా పనికి వస్తానని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పీఏసీ చైర్మన్ పదవికి తనను ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించినా పట్టించుకోలేదని నెహ్రూ అన్నారని తెలుస్తోంది.

పీఏసీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సూటిగా మాట్లాడాలని, ఆ పదవికి తాను సరిపోనని జగన్ తనను అనడం బాధించిందని, మరి వైసిపి శాసన సభా పక్ష ఉప నేతగా ఎలా సరిపోతానని ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. 59 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది తనకు పీఏసీ పదవి ఇవ్వాలని సూచించినా, జగన్ పట్టించుకోలేదని వాపోయారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+