ఏం చేసినా క్రెడిట్ చోరీ చేసేస్తున్న జగన్ ..! రేపు ఇవన్నీ.. చంద్రబాబు జోస్యం..!

అనకాపల్లికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాల్ని ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) విడుదల చేశారు. మొన్ననే వెలిగొండతో కృష్ణమ్మను తరలించి కరువుపీడిత మార్కాపురంనకు నీళ్లిచ్చామన్నారు. తూర్పు కనుమలను, అడవులను, నదుల్ని, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో గోదారమ్మ ఈ ప్రాంతానికి వచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు గోదారమ్మను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార నదికి అనుసంధానం చేస్తామన్నారు. శంకరంబాడి సుందరాచారీ చెప్పినట్లుగా గలగలా గోదారి...బిరబిరా కృష్ణ్మమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

నాటి గొడ్డలి పార్టీ చీకలి పాలనలో ఉత్తరాంధ్ర వణికిపోయిందని, ఎక్కడ చూసినా అరాచకాలు, కబ్జాలు, భయానక వాతావరణం ఉండేదన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులకు రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టని ఆ పార్టీ... ఆ నాయకుడి నివాసానికి, విలాసాల కోసం రూ.500 కోట్లు ఖర్చుచేసి రుషికొండపై ప్యాలెస్‌ కట్టుకున్నారని విమర్శించారు. ఆ రూ.500 కోట్లతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. విపక్షంలోనూ గొడ్డలిపార్టీ విషం చిమ్ముతోందన్నారు. విశాఖకు డేటా సెంటర్ వస్తే నీరు, విద్యుత్ కొరత వస్తుందని పేటియం బ్యాచ్‌తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు.

Chandrababu Targets YSRCP for Claiming Credit for Polavaram Bhogapuram Airport slams ys jagan rule

పోలవరం ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు తాగునీరు అందుతుందిని, అలాగే 9 లక్షల మందికి తాగునీరు కూడా అందుతుందని చంద్రబాబు తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు 23.44 టీఎంసీల నీరు పారిశ్రామిక, తాగు,సాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తామని తెలిపారు. 12 ప్రధాన ప్రాజెక్టులను రూ.3,200 కోట్ల వ్యయంతో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. డేటా సెంటర్లు మొత్తానికి కావాల్సింది కేవలం 5 టీఎంసీల నీళ్లేనని, కానీ పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకువచ్చే సామర్ధ్యం ఉందన్నారు. వైసీపీ రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తామే చేశామంటూ క్రెడిట్ చోరీ చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. భోగాపురం మేమే కట్టామని చెప్పుకుని నవ్వుల పాలయ్యారని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే సొరంగాలు మేమే తవ్వాం అని ప్రజలతో చీ కొట్టించుకుందని ఆక్షేపించారు. ఇప్పుడు అనకాపల్లికి నీళ్లు ఇస్తే ఇది కూడా మేమే చేశామని చెప్పుకుంటారన్నారు. రేపు పోలవరం పూర్తి కాగానే అదీ మా గొప్పే అంటారని జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+