ఈ అర్ధరాత్రి దాటాక తిరుపతి నుంచి ఈ రూట్ లో మెము స్పెషల్: సింగిల్ ట్రిప్- హాల్ట్ స్టేషన్లు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. శుక్రవారం నాడు 76,060 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 32,248 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.0 కోట్ల రూపాయల మేర కానుకలు టీటీడీకి అందాయి. 4.56 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. 2.21 లక్షలమంది అన్నప్రసాదాలను స్వీకరించారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయం ఇచ్చారు. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హారతులు పట్టారు. నారాయణుడిని స్మరించుకున్నారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన ఈ వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

SC Railway notified Unreserved MEMU Special Train to manage extra passenger Tirupati to Chennai Beach

నేడు గరుడసేవ. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనది. ఇతర బ్రహ్మోత్సవ రోజుల కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ తెల్లవారు జామున 3 గంటల నుండే భక్తులను స్వామివారి పుష్కరిణిలోకి అనుమతించారు. సాధారణంగా ప్రతిరోజూ తెల్లవారు జామున 6 గంటల నుంచి భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించడానికి అనుమతి ఉంటుంది. గరుడసేవ రోజున ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారంలో అనూహ్య మలుపు: బిగ్ షాట్ అరెస్ట్
తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారంలో అనూహ్య మలుపు: బిగ్ షాట్ అరెస్ట్

గరుడ సేవ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా ఓ అన్ రిజర్వుడ్ మెము ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. గరుడ సేవను తిలకించి స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యే వారికి అనుకూలంగా టైమ్ టేబుల్ రూపొందించారు.

భారత్ పై చర్యలకు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఆ సంతకంతో తలకిందులు
భారత్ పై చర్యలకు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఆ సంతకంతో తలకిందులు

తిరుపతి- చెన్నై బీచ్ స్టేషన్ల మధ్య ఈ మెము రాకపోకలు సాగిస్తుంది. 20వ తేదీన ఆదివారం నాడు తిరుపతి నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంటకు బయలుదేరే నంబర్ 07610 మెము స్పెషల్.. తెల్లవారు జామున 4:30 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్ కు చేరుకుంటుంది.

మళ్లీ తెల్లవారు జామున 5 గంటలకు చెన్నై బీచ్ స్టేషన్ నుంచి బయలుదేరే నంబర్ 07609 మెము స్పెషల్ ఉదయం 8:40 నిమిషాలకు రేణిగుంటకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు తిరుపతి వరకు వెళ్లదు. రేణిగుంట వరకే నడుస్తుంది. రేణిగుంట, పుత్తూరు, ఏకాంబరకుప్పం, తిరుత్తణి, అరక్కోణం, తిరువళ్లూర్, పెరంబూర్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+