ఖైరతాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిగా.. తెర పైకి- అక్కడే అసలు ట్విస్ట్ ..!!
ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు తో ఒక్క సారిగా రాజకీయం మారింది. ఖైరతాబాద్ నియోజకవర్గం ఖాళీ అయినట్లు కోర్టు ప్రకటన చేయటంతో.. ఇక ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే అభ్యర్ది విషయం లో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అటు బీజేపీ, బీఆర్ఎస్ సైతం ఉప ఎన్నిక కోసం తమ వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. అటు గ్రేటర్ ఎన్నికల వేళ.. ఈ ఉప ఎన్నిక అధికార పార్టీకి సవాల్ గా మారుతోంది.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక దిశగా కసరత్తు జరుగుతోంది. హైకోర్టు దానం నాగేందర్ పైన అనర్హత వేటు తో పాటుగా నియోజకవర్గం వేకెంట్ గా గుర్తిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దానం పైన అనర్హత పడటం తో బీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ ను అనుబంధంగా కొనసాగుతున్న మిగిలిన ఎనిమిది మంది లోనూ టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ నేతలు వారిని వదిలేది లేదని.. వారికీ ఇదే గతి పడుతుందని కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అటు దానం నాగేందర్ తాను వారియర్ అని చెబుతూ.. దేని కైనా సిద్దమని ప్రకటించారు. అయితే.. హైకోర్టు తీర్పుకు ముందే కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఈ అంశం పైన చర్చకు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ లోకి రావటం వలన అనర్హత వేటు పడటం తో తిరిగి దానం నాగేందర్ కే ఖైరతాబాద్ సీటు ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి మరో ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నా.. దానం కే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్ లో కొత్త లెక్కలు
దానం కొద్ది రోజుల క్రితం పార్టీ చీఫ్ ఖర్గేను సైతం కలిసారు. ఆ సమయంలోనే తాను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమని చెప్పారు. అయితే.. సీఎం రేవంత్ సూచనలకు అను గుణంగా నడుచుకోవాలని సూచించారు. ఇక, ఇప్పుడు హైకోర్టు వేటు వేయటంతో ఉప ఎన్నిక బరిలో దిగాల్సి వచ్చింది. దానం ఖైరతాబాద్ నుంచి మూడు సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఒకసారి, టీఆర్ఎస్ - బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు గెలుపొందారు. అయితే.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తికి తిరిగి సీటు ఇవ్వటం సరైనదా కాదా అనే చర్చ సాగుతోంది.
దీంతో.. విజయా రెడ్డి పేరు సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దానం నుం ఎమ్మెల్సీ చేసి మంత్రిగా తీసుకునే ఆలోచన ఉందని చెబుతున్నారు. దానం రాజకీయంగా పలు మార్లు ఎన్నికల్లో పోటీ చేయటం.. గెలవటం.. రాజీనామా చేయటం.. మళ్లీ పోటీ చేయటం పలు సందర్భా ల్లో చోటు చేసుకుంది. దీంతో.. దానం కు సీటు ఇవ్వాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చింది. అటు వైపు గ్రేటర్ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేల.. ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక రేవంత్ సమర్థతకు పరీక్షగా మారుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ సైతం తమ వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి.













Click it and Unblock the Notifications
