జగన్‌పై చంద్రబాబు వ్యూహం: ఇక కడప టార్గెట్

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: నంద్యాల, కాకినాడలో విజయం సాధించిన హుషారుతో కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మరో షాక్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారు. ఈసారి ఆయన నేరుగా జగన్ సొంత జిల్లా కడపను టార్గెట్ చేసుకుంటున్నారు.

రాష్ట్రంలో కొన్ని కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే రాజంపేట మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం కావాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం.

అందుకు వెంటనే పార్టీ క్యాడర్‌ను సమాయత్తపరిచి అభివృద్ధి పనులను పట్టణంలో వేగవంతం చేయాలని స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డికి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడానికి ముందు జగన్‌కు ఈ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుసతోంది.

వైసిపి అప్రమత్తం

వైసిపి అప్రమత్తం

అధికార పార్టీ వ్యూహాన్ని పసిగట్టిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి కూడా అప్రమత్తమయ్యారు. తమ వైసీపీ క్యాడర్‌ను కూడా అప్రమత్తం చేసి పట్టణంలో వైఎస్‌ కుటుంబంలో సభ్యులుగా చేరాలనే నినాదంతో నవరత్నాల ప్రకటన వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీంతో రాజంపేట పట్టణంలో ఎన్నికల సెగ పుట్టింది.

జగన్‌కు మరో షాక్ ఇవ్వాలని...

జగన్‌కు మరో షాక్ ఇవ్వాలని...

ప్రతిపక్ష నేత జగన్‌కు పట్టున్న సొంత జిల్లా అయిన కడప జిల్లాలో రాజంపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కొన్ని పంచాయతీలను విలీనం చేసే అంశంలో కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఈ ఎన్నిక వాయిదా పడింది. ఆ సమస్యలను అధిగమించి కోర్టులో ఉన్న కేసును తొలగించి ఎన్నికలు నిర్వహించడానికి అధికార పార్టీ సిద్దమైంది. అభివృద్ధి మంత్రంతో ఎన్నికలకు దిగి నంద్యాలలో మాదిరిగా వైసీపీకి షాక్‌ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది.

జగన్ ప్లాన్ ఇదీ..

జగన్ ప్లాన్ ఇదీ..

జగన్‌ సొంత జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పెట్టని కోట. అటువంటి జిల్లాలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌ బాబాయ్ వివేకానంద రెడ్డిని అధికార తెలుగుదేశం పార్టీ ఓడించింది. తిరిగి కడప జిల్లాలోని రాజంపేటలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నందున అధికార పార్టీని ఎలాగైనా ఎదుర్కొని తమ సత్తా చాటాలని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

  Chandrababu Naidu unhappy with Modi మోడీపై బాబు అసహనం, జగన్‌కు 20 శాతం ఆఫర్ | Oneindia Telugu
  జగన్

  జగన్

  జగన్ ఆలోచనకు అనుగుణంగా రాజంపేట మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి నేతృత్వంలో మూడు రోజులుగా రాజంపేటలో ఇంటింటా వైఎస్‌ కుటుంబం పేరిట ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కడప జిల్లాలో తమ పట్టును నిరూపించుకోవాలని జగన్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chandrababu targts Jagan with Kadapa district

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి