ఇరుకు: లేక్‌వ్యూ చూసిన బాబు ఫ్యామిలీ, బిల్డింగ్ ప్లాన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో ఇల్లు మారనున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్‌లోని సొంత ఇంటి నుండి లేక్ వ్యూ అతిథి గృహానికి మారాలని భావిస్తున్నారు. ఇటీవలి వరకు లేక్ వ్యూ అతిథి గృహం సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంది. సచివాలయంలో సీఎం కార్యాలయం సిద్ధం కాకపోవడంతో ఇప్పటి వరకు లేక్ వ్యూ అతిథి గృహం నుండే అధికారిక కార్యకలాపాలు నిర్వహించారు.

ఈ దసరా పండుగ నాటికి సచివాలయంలోని తన కార్యాలయం సిద్ధం కావడంతో బాబు అక్కడికి మారారు. దీంతో లేక్ వ్యూ అతిథి గృహం ఖాళీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో లేక్ వ్యూను తన అధికారిక నివాసంగా మార్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆదివారం నాడు ఆయన కుటుంబ సభ్యులు లేక్ వ్యూ అతిథి గృహాన్ని పరిశీలించారు. అవసరమైన మార్పులు, చేర్పులు చేసిన తర్వాత డిసెంబరులో లేక్ వ్యూ అతిథి గృహానికి బాబు కుటుంబం మారనుంది.

కాగా, చంద్రబాబు ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని తన సొంత ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిలో మూడే గదులు ఉన్నాయి. ఒకటి తనకు, మరొకటి కుమారుడికి, మూడో గది అతిథిల కోసం కేటాయించేవారు. ఆరువేల చదరపు అడుగుల ఇల్లు అయినప్పటికీ కింది అంతస్తు మొత్తం పార్టీ కార్యక్రమాలకు, అధికారిక కార్యక్రమాలకే కేటాయించారు. పై అంతస్తులో మూడు గదులు మాత్రమే ఉండేవి.

Chandrababu to renovate ‘congested’ residence

తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అదే నివాసంలో ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇల్లు మారాలని, మారితేనే సీఎం అవుతారని కూడా పలువురు సూచించారు. ఈ ఇంట్లో ఉండగానే సీఎం అయ్యానని, ప్రపంచం మొత్తం తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని, ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడే ఉంటానని చంద్రబాబు నవ్వుతూ చెప్పేవారు.

ఇప్పుడు చంద్రబాబు తాత కాబోతున్నారు. తనను కలిసేందుకు వచ్చే సందర్శకులు, కుటుంబ అవసరాలకు అనుగుణంగా లేక్ వ్యూ అతిథి గృహంలో అవసరమైన మార్పులు చేయనున్నారు. భారీ మార్పులు అవసరమైన పక్షంలో కొండాపూర్‌లోని తన ఫామ్ హౌస్ గానీ, మరేదయినా ప్రయివేటు ఇంట్లో గానీ ఉండాలని చంద్రబాబు యోచిస్తున్నారని అంటున్నారు. కాగా, తాను సామాన్య జీవితం గడుపుతున్నానని, నా ఇల్లు చాలా చిన్నది, మీరే గుర్తించారు కదా! అంటూ మీడియా ప్రతినిధులతో చంద్రబాబు అనేక పర్యాయాలు పేర్కొన్నారు.

చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాడు. లోకేష్ వివాహం కావడంతో ఈ ఇల్లు సరిపోవడం లేదు. పైగా ప్రస్తుతం లోకేష్ కూడా పార్టీలో కీలకపాత్ర పోషించడం ప్రారంభించడంతో ఒకవైపు చంద్రబాబు కోసం, మరోవైపు లోకేష్ కోసం వచ్చే సామాన్యులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులతో ప్రస్తుతం ఉన్న ఇంటిప్రాంగణం కిటకిటలాడుతోంది.

ఈ ఇల్లు ముఖ్యమంత్రి అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ భవనం స్థానంలో ఆధునిక హంగులతో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కనీసం పది పడకగదులు, నాలుగైదు హాళ్లు, వీడియో కాన్ఫరెన్స్‌కోసం ఒక హాలు, దేశ విదేశీ అతిధులతో చర్చించేందుకు ప్రత్యేక హాలు, మీడియా సమావేశాలకు ఒక హాలు, విజిటర్లు వేచి ఉండేందుకు, విజిటర్లతో కలిసేందుకు ప్రత్యేక హాళ్లు, విశాలమైన కిచెన్, ఇతర మౌలిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారంటున్నారు.

2014 డిసెంబర్‌లో కొత్త భవన నిర్మాణం ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ భవన నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని నిర్ణీత కాలవ్యవధిలో కొత్త భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. కొత్త భవన నిర్మాణం పూర్తయ్యే వరకు చంద్రబాబు లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో కాని, ఫాంహౌజ్‌లోకాని ఉంటారని తెలిసింది.

ఇదిలా ఉండగా. కుటుంబ సమేతంగా నివాసానికి లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్ అనువుగా ఉంటుందా? అన్న అంశంపై పరిశీలన చేస్తున్నారు. ఒకవేళ ఇది బాగానే ఉంటుందని భావిస్తే, దాదాపు ఏడాదిపాటు బాబు తాత్కాలిక నివాసంగా లేక్‌వ్యూ మారిపోతుంది. లేనిపక్షంలో ఆధునిక హంగులతో ఉన్న ఒక ఫాంహౌజ్‌లో ఆయన ఉంటారని తెలిసింది. ఈ అంశంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అన్ని కోణాల్లో ఆలోచించి నివాసమార్పిడిపై బాబు నిర్ణయం తీసుకుంటారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+