నేర్చుకోవాల్సింది, ఎపికి ద్రోహం: బాబు, ధీటుగా జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య సోమవారం వాగ్వాదం జరిగింది. విభజన, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర విషయమై జగన్ మాట్లాడుతుండగా గందరగోళం చెలరేగింది. జగన్ ప్రసంగంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇంకా నేర్చుకొని మాట్లాడితే బాగుండేదని, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని తాను నటించానని, విభజనతో ఎపికి నష్టమని అప్పుడు చెప్పి.. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందని చెబుతారా అని జగన్‌ను నిలదీశారు. రెండు రాష్ట్రాల విభజించినప్పుడు లోటు బడ్జెట్ ఉంటుందని గవర్నరే కేంద్రానికి లేఖ పంపించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.

గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండా ప్రతిదానిని వక్రీకరించి మాట్లాడుతున్నారంటే... ఎపి బ్రహ్మాండంగా ఉందని చెప్పడం ద్వారా రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎపి బ్రహ్మాండంగా ఉందని చెప్పి రాష్ట్రానికి కేంద్రం నుండి డబ్బులు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, తాను ఎప్పటి నుండో ఉన్నానని చెప్పారు. ఎన్నికలకు ముందు విభజనతో ఎపి పరిస్థితి బాగుండదని, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందని చెబుతారా అన్నారు. ఇబ్బందులు, అప్పుల గురించి జగన్ ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. అఫ్పులు జనాభా ప్రాతిపదికన, ఆదాయం ప్రాంతీయం ఆధారంగా చేశారని దాని గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

Chandrababu Versus YS Jagan in AP Assembly

అన్యాయం జరిగింది, ఇబ్బందుల్లో ఉన్నాం, కేంద్రం నిధులు ఇవ్వాలని తాను అడుగుతుంటే.. మీరు బ్రహ్మాండంగా ఉందంటారా అన్నారు. వనరులు ఉన్నాయని తాము కూడా చెప్పామన్నారు. జగన్ పూర్తిగా చదివి, మొదటి సమావేశంలోనే కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకునేలా మాట్లాడకుండా ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు.

మీకు అనుభవం లేదు అనేందుకు ఇదో ఉదాహరణ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం వద్దన్నారు. విమర్శలకు మరో ఐదేళ్ల సమయం ఉందన్నారు. ఇబ్బందుల్లో ఉంటే కావాలని వక్రీకరించి మాట్లాడి చరిత్రహీనులుగా మిగిలిపోవద్దన్నారు. జగన్ తీరు చూస్తుంటే కాంగ్రెసు పార్టీతో లాలూచీ పడినట్లు, ఎపికి అన్యాయం జరగనట్లుగా చెబుతున్నట్లు కనిపిస్తోందన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ కూడా ధీటుగానే స్పందించారు. తన ప్రసంగం అర్థం చేసుకునే వారు అర్థం చేసుకోవడం లేదన్నారు. విభజనతో అన్యాయం జరిగిందన్నది ఎవరికీ తెలియంది కాదన్నారు. సమన్యాయం అని చెప్పి అది జరగకుండానే బిజెపికి ఎలా మద్దతిచ్చారో చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+