వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటికెళ్లి పరామర్శ: బాలకృష్ణ ఆరోగ్యంపై బాబు ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ హీరో, హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణను హైదరాబాదులోని ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మూడు రోజుల క్రితం హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డుపై సినిమా షూటింగు చేస్తుండగా బైక్ రేసింగ్ సన్నివేశం సమయంలో బాలయ్య కాలికి గాయమైంది. ఆ వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయనకు చికిత్స అందించిన అనంతరం ఇంటికి తిరిగి వచ్చారు.

Chandrababu visits Balakrishna's home

బాలయ్యకు గాయం పైన జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తన ట్విట్టర్లో బాబాయ్ ప్రమాదం గురించి స్పందించారు. గాయంపై ఎన్టీఆర్ తన ట్విట్టర్లో స్పందిస్తూ...‘బాబాయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అభిమానులు ఆందోళన చెందవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. సింహం క్షేమంగానే ఉంది. మళ్లీ వచ్చి గర్జిస్తుంది' అంటూ ఎన్టీఆర్ ట్విట్ చేశారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu visited Balakrishna's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X