చంద్రబాబు వైట్ ఎలిఫెంట్ వ్యాఖ్యల అర్ధం అదే:మాజీమంత్రి విడదల రజిని

విశాఖ స్టీల్‌ ప్లాంటుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మరోసారి ఆంధ్రుల ద్రోహిగా సీఎం చంద్రబాబు మారారని మాజీ మంత్రి విడదల రజిని ఫైర్‌ అయ్యారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చంద్రబాబు ఉరి బిగించే కుట్ర చేశారన్నారు. కేంద్రంతో కుమ్మక్కై సంస్థ ప్రైవేటీకరణకు సీఎం స్కెచ్‌ వేశారని విడదల రజిని ఆరోపించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంకేతాలు ఇస్తున్న చంద్రబాబు: విడదల రజిని
సీఐఐ సదస్సులో 'వైట్‌ ఎలిఫెంట్‌' వ్యాఖ్యల వెనుక అర్థం అదేనంటూ ఆమె చంద్రబాబును టార్గెట్ చేశారు. ప్రైవేటీకరణకు అనుకూలమని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారని పేర్కొన్న విడదల రజిని చంద్రబాబు విశాఖ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయకుండా తిని కూర్చున్నారని, వారి వల్లనే ప్లాంట్ కు నష్టం జరిగిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రైవేటీకరణ ఆలోచన చేస్తున్న కేంద్రానికి ఆయుధం అందించేలా ఉన్నాయన్నారు.

Chandrababu White Elephant comments means visakha steel plant privatization vidadala rajini fire

Take a Poll

నాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించిన జగన్
మాజీ మంత్రి విడదల రజిని ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇచ్చిన మాటకు ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఐదేళ్లపాటు ఆగిందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ వ్యతిరేకమని ఆరోజు వెల్లడించారని గుర్తుచేశారు. ప్రధాని మోదీకి కేంద్రానికి ఈ విషయాన్ని జగన్ నివేదించారని, బహిరంగసభలో లక్షలాది ప్రజలసాక్షిగా చెప్పారని పేర్కొన్నారు.

సంపద సృష్టి పేరుతో చంద్రబాబు చేస్తుందిదే
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడే మార్గాలు సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్టుగా మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం పై చంద్రబాబు చౌకబారు విమర్శలు చేసి కార్మికులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారన్నారు. సంపద సృష్టి పేరుతో చంద్రబాబు సూట్ కేసు కంపెనీలకు ప్రభుత్వ భూములను కేటాయించి వారికి సంపద సృష్టించి పెడుతున్నాడని విడదల రజని మండిపడ్డారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే లక్షల మందిపై ప్రభావం
రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇప్పుడు ఆచరణ సాధ్యం కాని విజన్ 2047 అంటూ డ్రామా చేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేటుపరం చేశారని, సంస్థలో కొత్త ఉద్యోగాల భర్తీ లేదని, ప్లాంట్ కార్మికులకు యాజమాన్యం జీతాలు బకాయి పెట్టిందని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వ వైఖరితో 20వేల మంది శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలు పరోక్షంగా లక్షలాదిమందిపైన దీని ప్రభావం పడుతుందన్నారు.

వైసీపీ పక్షాన కార్మికులతో పోరాటం చేస్తాం
కూటమి ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని మాజీ మంత్రి విడదల రజని డిమాండ్ చేశారు. వైసిపి పక్షాన సంస్థ కార్మికులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. వారికి న్యాయం జరిగే వరకు వైసీపీ విరమించేది లేదని ఆమె స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+