ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్: ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. జూన్ 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బీజేపీ పార్లమెంటరీ భేటీ తర్వాత, మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎన్డీఏ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరుకావాలని నిర్ణయించారు. మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.

Chandrababu Will Take Oath As Andhra Pradesh CM On June 12th

ఎల్లుండి రాష్ట్రపతి ముర్మును కలిసి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అందులో భాగంగా జూన్ 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని, ఆ కార్యక్రమం అనంతరం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, బుధవారం నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలిసి నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ ప్రధాని నరేంద్ర మోడీనేనని స్పష్టం చేశాయి. అయితే, బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రావడంతో ఎన్డీఏ పక్షాల మద్దతు కీలకంగా మారింది. జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారారు. ఏపీలో ఎన్డీఏ కూటమి 21 ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+