బాబు ప్రమాణం: జూన్ 8, ఉదయం 11.40 గంటలకు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జూన్ 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంతో దాంతో రాష్ట్రపతి పాలన ముగుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జూన్ 8వ తేదీదాకా రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 8వ తేదీ ఉదయం 11.40 గంటలకు విజయవాడ-గుంటూరు మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి ఒకటి రెండు రోజుల ముందు తిరుపతిలో తెలుగుదేశం శాసనసభాపక్షం సమావేశం జరుగుతుంది. ఎమ్మెల్యేలు తమ నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్‌కు సమాచారం ఇచ్చారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాసనసభా సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై ఆసక్తి నెలకొంది. కెసిఆర్ జూన్ 2వ తేదీనే ప్రమాణ స్వీకారం చేసినా ఆ వెంటనే అసెంబ్లీ భేటీ అయ్యే అవకాశం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి, కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి శాసనసభా సమావేశాలపై ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
అసెంబ్లీ సమావేశాలతోపాటు ప్రొటెం స్పీకర్‌పైనా కేబినెట్‌లో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాజ్‌భవన్ నుంచి అసెంబ్లీ సమావేశాలపై బులెటిన్ విడుదల అవుతుంది.












Click it and Unblock the Notifications