కంగ్రాట్స్ చెప్పిన వైఎస్ జగన్- చంద్రబాబు
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో.. మరో ఘనతను సాధించింది. చంద్రయాన్ 3 రాకెట్‌ను నింగిలోకి పంపించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు దూసుకెళ్లింది ఈ రాకెట్. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. చందమామ దక్షిణ ధృవం వద్ద ల్యాండ్ అవుతుంది.
2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో. దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లనూ చేసింది. వారి అంచనాలకు అనుగుణంగా ప్రారంభం దశలో రాకెట్ ప్రయాణం.. సవ్యంగా సాగింది. దశలవారీగా అన్ని రాకెట్ నుంచి విడిపడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కేజీలు. ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో ఇది చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అవుతుంది. చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను ఈ రాకెట్‌తో పాటు పంపించారు.
CM @ysjagan has congratulated @isro team for the successful launch of #Chandrayaan3, the Mission to Moon. He wished the lunar expedition a smooth and successful landing propelling country’s space prowess in to orbit of glory winning a place of pride on the global map. https://t.co/8nt4S7W8iL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 14, 2023
ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్, ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పోక్ట్రోస్కోపీ.. వంటివి ఈ రాకెట్ పేలోడ్స్. లాంచ్ ప్యాడ్ నుంచి దూసుకెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ తన పథంలోనే సవ్యంగా సాగింది. కొద్దిసేపటి తరువాత రాకెట్ నుంచి చంద్రయాన్ 3 శాటిలైట్ విడిపోయింది.
ఈ ప్రయోగం విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. అంతరిక్ష పరిశోధనలో ఇస్రో.. మరో ముందడుగు వేసిందని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించదగ్గ క్షణమని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ శ్రీహరికోట వైపు చూపులు సారించేలా చేశారని ప్రశంసించారు.
Congratulations to the team at @isro on the successful launch of #Chandrayaan3 from Sriharikota, which highlights India's remarkable progress in the field of space exploration! The achievement is a clear demonstration of the unwavering commitment and perseverance of our diligent… pic.twitter.com/YYOLl1RIYT
— N Chandrababu Naidu (@ncbn) July 14, 2023
ఈ విజయ పథంలో ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ సవాళ్లను అధిగమించగలిగారని చెప్పారు జగన్. చంద్రయాన్ 3 విజయవంతం కావడం వెనుక శాస్త్రవేత్తల అచంచలమైన నిబద్ధత, పట్టుదల ఉందని, దానికి నిదర్శనమే.. ఈ ప్రయోగమని అన్నారు. దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగిందంటూ జగన్, చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications