Chandrayaan 3: అంతరిక్ష ప్రయోగాలకు గేట్ వే..శ్రీహరికోట
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో.. మరో ఘనతను సాధించింది. చంద్రయాన్ 3 రాకెట్‌ను నింగిలోకి పంపించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు దూసుకెళ్లింది ఈ రాకెట్. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. చందమామ దక్షిణ ధృవం వద్ద ల్యాండ్ అవుతుంది.
2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో. దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లనూ చేసింది. వారి అంచనాలకు అనుగుణంగా ప్రారంభం దశలో రాకెట్ ప్రయాణం.. సవ్యంగా సాగింది. దశలవారీగా అన్ని రాకెట్ నుంచి విడిపడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కేజీలు. ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో ఇది చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అవుతుంది. చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను ఈ రాకెట్‌తో పాటు పంపించారు.
ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్, ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పోక్ట్రోస్కోపీ.. వంటివి ఈ రాకెట్ పేలోడ్స్. లాంచ్ ప్యాడ్ నుంచి దూసుకెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ తన పథంలోనే సవ్యంగా సాగింది. కొద్దిసేపటి తరువాత రాకెట్ నుంచి చంద్రయాన్ 3 శాటిలైట్ విడిపోయింది.
#WATCH | Sriharikota: "It is indeed a moment of glory for India and destiny for all of us here at Sriharikota who were part of a history in the making. Thank you team ISRO for making India proud & thank you PM Modi for making this possible by unlocking the gates of Sriharikota… pic.twitter.com/uMjvvb1yTw
— ANI (@ANI) July 14, 2023
ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ఇవ్వాళ ఆయన శ్రీహరికోటకు వచ్చారు. షార్ సెంటర్‌లో ప్రయోగాన్ని తిలకించారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన వెంటనే, ఛైర్మన్ ఎస్ సోమనాథ్‌తో కలిసి శాస్త్రవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు.
యావత్ దేశం గర్వించదగ్గ క్షణమని జితేంద్ర సింగ్ అన్నారు. శ్రీహరికోటలో ఘన చరిత్రను లిఖించిందని పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారని ప్రశంసించారు. దేశం గర్వించేలా చేశారంటూ కితాబిచ్చారు. అంతరిక్ష ప్రయోగాలకు శ్రీహరికోట ఓ గేట్ వేగా మారిందంటూ వ్యాఖ్యానించారు జితేంద్ర సింగ్.












Click it and Unblock the Notifications