Aditya L1: సూర్య కక్ష్యకు చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? పేలోడ్స్ ఏంటీ?

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.

ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది ఇస్రో. సూర్యుడిపై ప్రయోగాలకు సన్నద్ధమైంది. దీనికోసం ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇప్పటికే ఈ రాకెట్, శాటిలైట్ బెంగళూరులోని యూఆర్ రావు సెంటర్ నుంచి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది కూడా.

Chandrayaan 3: The Launch Rehearsal of Aditya L1 are completed

సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11:50 నిమిషాలకు ఆదిత్య ఎల్1‌ సూర్యుడి వైపు దూసుకెళ్లబోతోంది. ప్రయోగించిన రోజు నుంచి ఈ శాటిలైట్ సూర్యుడి దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 110 నుంచి 120 రోజుల తరువాత ఎల్1కు చేరుకుంటుంది. ఈ శాటిలైట్‌ను మోసుకెళ్లడానికి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను వినియోగించనుంది ఇస్రో.

దీనికి సంబంధించిన తుదిదశ కసరత్తు పూర్తయినట్లు ఇస్రో తెలిపింది. లాంచ్ రిహార్సల్స్, లాంచింగ్ వెహికల్ అంతర్గత పరికరాలు, ఇతర యంత్రసామాగ్రి, డేటా కనెక్షన్స్, కంట్రోల్ రూమ్‌తో లింకేజ్ వ్యవస్థ.. వంటి కీలక విభాగాల తుదిదశలో తనిఖీ నిర్వహించినట్లు పేర్కొంది. లాంచింగ్ ప్రక్రియ ఏర్పాట్లను మొదలుపెట్టినట్లు వివరించింది.

ఈ ప్రయోగం విజయవంతమైతే.. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి శాటిలైట్‌ను పంపించిన మొట్టమొదటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇదే అవుతుంది. భూమి-సూర్యుడి మధ్య ఉన్న దూరం 1.5 మిలియన్ కిలోమీటర్లు. ఎల్ 1 అంటే లాగ్ రేంజ్ పాయింట్ అని అర్థం. హాలో కక్ష్యలో ఈ శాటిలైట్‌ను పరిభ్రమింపజేయడం ద్వారా సూర్యుడి నుంచి వెలువడే ధాతువులపై నిరంతరం అధ్యయనం చేయగలుగుతుంది ఇస్రో.

మొత్తంగా ఏడు పేలోడ్స్‌ను తన వెంట మోసుకెళ్తుంది ఈ శాటిలైట్. రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ కేటగిరీలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనోగ్రాఫ్, సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ ఉంటాయి. ఇన్-సైటు పేలోడ్స్ కేటగిరీలో హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్యను ఈ శాటిలైట్ తీసుకెళ్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+