పవన్ కల్యాణ్ సభలో తోపులాట: "బాబు దర్శకత్వంలో పవన్ కల్యాణ్"

అనంతపురం: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిందూపురం సమావేశం రసాభాసగా మారింది. హిందూపురంలో ఆయన సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

తన అనంతపురం జిల్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు సోమవారం హిందూపురంలోని జెవిఎ్ ప్యాలెస్‌లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చశారు. అబిమానుల అత్యుత్సాహం కారణంగా తోపులాట జరిగింది.

తోపులాటతో గాయాలు

తోపులాటతో గాయాలు

కార్యకర్తల తోపులాట వల్ల గందరగోళం నెలకొన్ని హాల్‌లోని గాజు అద్దాలు పగిలాయి. నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జయచంద్ర, నరసింహమూర్తి, మంజునాథ్‌లతో పాటు మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తోంది.

Recommended Video

    పవన్ కొత్త డిమాండ్, అపశృతి: హోదాపై మాట్లాడవేం పవన్ ?
    పవన్ మధ్యలోనే ముగించుకుని...

    పవన్ మధ్యలోనే ముగించుకుని...

    గాయపడినవారిలో జయచంద్ర పరిస్థితి సీరియస్‌గా ఉందని అంటున్నారు. సమావేశంలో గందరగోళం చోటు చేసుకోవడంతో పవన్ కల్యాణ్ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన జయచంద్రను బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది.

     చంద్రబాబు దర్శకత్వంలో పవన్

    చంద్రబాబు దర్శకత్వంలో పవన్

    సినిమాలు మానేస్తానని చెబుతున్న పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దర్శకత్వంలో పర్యటనల రూపంలో మరో సినిమా తీస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వేయి కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న నేపథ్యంలో ఆయన అనంతపురంలో ర్యాలీ నిర్వహించారు.

     పవన్ కల్యాణ్‌ను నమ్మడం లేదు...

    పవన్ కల్యాణ్‌ను నమ్మడం లేదు...

    ప్రజా మద్దతు కోల్పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఆయనకు మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్‌ను ప్రజలు విశ్వసించడం లేదని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. జనంలోకి వచ్చి పాదయాత్ర చేస్తున్న జగన్2ు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరని, ఈ యాత్ర 3 వేల కిలోమీటర్లు చేరుకుంటుందని ఆయన అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+