ప్రియుడి చేతిలో మోసపోయి..: కాకినాడలో టీచర్ ఆత్మహత్య!..

Subscribe to Oneindia Telugu

కాకినాడ: ప్రేమ పేరుతో మోసపోయానని గ్రహించిన ఓ టీచర్ ఆత్మహత్యకు పాల్పడింది. కాకినాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తి.. రెండు నెలలుగా మాట్లాడటం మానేయడం, ఇదేమని అడిగితే.. రూ.20లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. తీవ్ర మనస్థాపానికి గురై ఆమె ఆత్మ చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కాకినాడకు చెందిన శిరీష అనే యువతి బీటెక్ మధ్యలో ఆపేసి, పిఠాపురంలోని ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. ఇదే క్రమంలో ఆమెకు విజయరత్నం అనే యువకుడితో స్నేహం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో శిరీష కూడా అతన్ని బలంగా నమ్మింది.

Cheated by lover, girl commits suicide in Kakinada

అయితే గత రెండు నెలలుగా విజయరత్నం తనతో మాట్లాడటం మానేయడంతో.. శిరీష తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇదే విషయంపై నిలదీస్తే.. రూ.20లక్షలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. దీంతో విజయరత్నం తనను మోసం చేశాడన్న విషయం జీర్ణించుకోలేక శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య సమయంలో సూసైడ్ వీడియో తీసి, తన చావుకు ప్రియుడే కారణమని చెప్పింది. మరో సూసైడ్ నోట్ లో తన తల్లికి మాతృదినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెబుతూ, అమ్మా ఐ లవ్ యూ అని పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sirisha, a resident of Kakinada has committed suicide as she was cheated by the lover.She discontinued B Tech and used to work as a teacher at Pithapuram.
Please Wait while comments are loading...