రూ.5 కోట్ల అప్పు: కడప జిల్లాలో గాలి జనార్ధన్ రెడ్డిపై చీటింగ్ కేసు
: మైనింగ్ కింగ్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌లో చీటింగ్ కేసు నమోదయింది. గాలిపై కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది.
కడప: మైనింగ్ కింగ్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌లో చీటింగ్ కేసు నమోదయింది. అక్రమ గనుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలిపై కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది.
తన వద్ద రూ.5 కోట్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని విశాఖపట్నంకు చెందిన బతుకుబాయ్ బాలాబాయ్ పటేల్ అనే వ్యక్తి మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

జమ్మలమడుగు ప్రాంతంలో బ్రహ్మణి స్టీల్స్ కోసం సదరు మొత్తాన్ని తన వద్ద అప్పు తీసుకున్నారని ఈ సందర్భంగా బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గాలిపై చీటింగ్ కేసు నమోయింది.












Click it and Unblock the Notifications