ప్రేమ పేరుతో వంచన: అమ్మాయిని గర్భవతిని చేశాడు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పెడనలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ బాలికను లోబర్చుకున్న యువకుడు గర్భవతిని చేశాడు. తమ కుటుంబసభ్యుల అప్పును తాను చెల్లిస్తానంటూ తనను లోబర్చుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడు పరారీలో ఉన్నాడు. పెడన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
దొంగల బీభత్సం
ప్రకాశం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంగోలు, చంద్రాయనగర్, గద్దల కూట కాలనీలో రెచ్చిపోయిన దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. రూ.50వేల నగదు, 20 తులాల బంగారాన్ని అపహరించారు.

జక్రయ్య హాస్పటల్ సెంటర్, పెళ్లూరు, ఏడుగుడ్లపాడు, హౌసింగ్ బోర్డు కాలనీల్లో వాకింగ్ చేస్తున్న మహిళల నుంచి మంగళసూత్రాలు లాక్కెళ్లారు. గద్దలగుట్టలో రోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న కారు అద్దాలు పగులగొట్టి మ్యూజిక్ సిస్టమ్‌ను ఎత్తుకెళ్లారు.
తల్లీకొడుకుల మృతదేహాలు లభ్యం
ప్రకాశం జిల్లా నందనవనం దగ్గర పల్లివాగులో తల్లీకొడుకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications